పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చిన వలస హిందూ కుటుంబం అది. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో 2012 నుంచి జీవిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. ఇంకా భారత పౌరసత్వం రాలేదు. ఒక కుటుంబంలోని 11 మంది ఆదివారం అనుమానాస్పదంగా పొలంలో నిర్జీవంగా పడి ఉండడం కలకలం రేపింది. ఆ కుటుంబంలో ఒకే ఒక్కరు ‘దేచు’ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉన్నాడు. ఇప్పుడీ మిస్టరీ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించడం.. వారంతా ఊరి చివరన పొలంలో మృతదేహాలుగా పడిఉండడం కలకలం రేపింది. కొంత మంది కూలీలు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది.
వీరంతా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఇంకేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయితే కరోనా లాక్ డౌన్ తో వీరందరికీ ఉపాధి కోల్పోవడం.. భారత పౌరసత్వం లేకపోవడంతో వీరికి సంక్షేమ పథకాలు.. రేషన్ అందక పనిలేక వీరంతా తిండికి తిప్పలై సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో మిగిలిన ఒక్కడిని ప్రస్తుతం విచారిస్తున్నారు.