పేరుకు చిన్నదేశమైనా అక్కడి అభివృద్ధితో ప్రపంచాన్ని ఆకర్షించింది 'సింగపూర్'. అయితే అన్నింటికి ద్వారాలు తెరిచి అభివృద్ధి సాధిస్తున్న ఈ దేశం డ్రగ్స్ విషయంలో మాత్రం కఠిన చట్టాలను అమలు చేస్తోంది. సింగపూర్ లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే మహా నేరం. ఈ కేసులోనూ ఓ భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉరిశిక్ష పడింది.
నాగేంద్రన్ ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తికి తాజాగా సింగపూర్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. నిందితుడు నాగేంద్రన్ కు శిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చాలని.. 11 ఏళ్లుగా సాగిన పోరాటం ఫలించలేదు. క్షమాభివక్ష కోసం 11 ఏళ్లుగా సాగుతున్న పోరాటం కూడా చివరకు విఫలమైంది.
నాగేంద్రన్ ధర్మలింగం మానసిక స్థితి సరిగ్గా లేదని..ఆయనకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని అంతర్జాతీయంగా పోరాటం సాగించినా ఎంతకూ సింగపూర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా కనికరించలేదు.
చివరకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నాగేంద్రన్ ధర్మలింగంకు ఉరిశిక్షను అమలు చేశారు. మలేషియా పౌరుడైన భారత సంతతికి చెందిన నాగేంద్రన్ ధర్మలింగంను 2009లో సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో నిందితుడిగా చేర్చారు. హెరాయిన్ ను అక్రమ రవాణా చేస్తున్నాడని అతడిపై అభియోగం మోపారు. ఈ కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్ కు 2010లో అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది.
ఇక తనపై నేరారోపణను కొట్టివేయాలని ఆయన పెట్టుకున్న పిటీషన్ ను 2011లో కోర్టు తిరస్కరించింది. ఉరిశిక్ష బదులు యావజ్జీవ శిక్షగా మార్చాలని 2015లో దాఖలు చేసిన పిటీషన్ ను కూడా కోర్టు కొట్టేసింది.
నాగేంద్రన్ 2019లో చేసుకున్న మరో అప్పీల్ ను కూడా కోర్టు తిరస్కరించింది. క్షమాభిక్ష కోసం సింగపూర్ అధ్యక్షుడికి పెట్టుకున్న పిటీషన్ కూడా తిరస్కారానికి గురైంది. నాగేంద్రన్ కు బెదిరించి అక్రమంగా డ్రగ్స్ రవాణా చేయించారని.. ఆయన అమాయకుడిని కుటుంబ సభ్యులు తెలిపారు.
నాగేంద్రన్ ను గత ఏడాది నవంబర్ 10నే ఉరితీయాల్సి ఉండగా.. కరోనా సోకడంతో వాయిదా వేశారు. నాగేంద్రన్ కు ఉరిశిక్ష వద్దంటూ ఏకంగా పిటీషన్ పై 56,134 మంది సంతకాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.