ఉత్తరప్రదేశ్ లోని మధుర నగరంలో శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్టు పేరుతో మోసం .. ప్రజలనుంచి విరాళాలు వసూలు చేసిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేమైందంటే .. అయోధ్య లో రామ మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం రామజన్మ భూమి ట్రస్ట్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య లో రామమందిరానికి సంబంధించిన ఏ విషయాన్ని అయినా కూడా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతాయి. అయితే , అయోధ్యలో మాదిరే .. మధురలో కూడా శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ పేరిట ఓ సంస్థ వెలసింది.
శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ ఏర్పడితే మంచిదే కదా అని అనుకుంటున్నారా ? ..ఆ ట్రస్ట్ మంచిదైతే ఏం అనుకోవాల్సిన పనిలేదు. కానీ , అది బోగస్ ట్రస్ట్. మధుర నగరానికి చెందిన భగవతాచార్య ఆధ్వర్యంలో 13 మంది ట్రస్టు పేరిట విరాళాలు వసూలు చేశారు. ఆ శ్రీకృష్ణ జన్మస్థానంలో శ్రీకృష్ణజన్మభూమి నిర్మాణ న్యాస్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించి విరాళాలు వసూలు చేస్తున్నారని శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టు కార్యదర్శి కపిల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 1944లో ఏర్పాటైన ట్రస్టు ఆలయ పునర్ నిర్మాణ పనులు చేపట్టిందని శర్మ పేర్కొన్నారు.ప్రజలను ట్రస్టు పేరిట మోసగించిన 13 మందిపై తాము ఐపీసీ సెక్షన్ 406, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మధుర పోలీసులు తెలిపారు.