హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఒక బాలికను కిడ్నాప్ చేసిన యువకులు ఓయో రూం తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన వైనం విస్తుగొలుపుతోంది. నగరంలోని పాతబస్తీకి చెందిన ఒక 13 ఏళ్ల బాలికపై కొందరు యువకులు రెండు రోజుల పాటు లాడ్జిలో అత్యాచారం చేశారు. ఆమెను కిడ్నాప్ చేసిన యువకులు మత్తు మందు ఇచ్చి హోటల్ కు తీసుకెళ్లినట్లు సమాచారం.
మత్తు మందు ఇచ్చి ఆమె పడిపోయాక.. ఓయో యాప్ లో ఒక లాడ్జి రూం బుక్ చేసి అందులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత బాలికను ఓయో రూంలోనే వదిలి వెళ్లారు.
అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లో బాలికలపై గ్యాంగ్ రేప్ ఘటన ఈ ఏడాది ఇది రెండోది. అప్పట్లో పబ్ లో బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కొందరు యువకులు కారులోనే అత్యాచారం చేశారు. ఈ వీడియోలు బయటకు వచ్చి దుమారం రేగింది. తాజాగా మరో రేప్ ఘటన బయటపడడం సంచలనమైంది.
పాతబస్తీకి చెందిన యువకులే ఈ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చి రేప్ చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ యువకుల కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.