సంక్షేమ పథకాలకు అప్పు.. సాగునీటి ప్రాజెక్టులకు అప్పు.. రోడ్ల నిర్మాణానికి అప్పు.. భారీ పరిశ్రమలకు అప్పు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మొదలు.. 70 ఏళ్లుగా కొనసాగుతున్న రుణ పరంపర.. ఏకంగా 1.33 లక్షల కోట్లు.. ఇదీ రుణ భారతం. మొత్తం గత 70 ఏళ్లలో దేశ అప్పు 5.29 లక్షల శాతం పెరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అంటే.. 1950-51లో దేశం నికర అప్పు రూ.2వేల 565.40కోట్లు ఉండగా 2021-22 నాటికి అది రూ.కోటి 35లక్షల 86వేల 975.52కోట్లకు చేరింది.
సమాచార హక్కుతో వెలుగులోకి..
సాధారణంగా అయితే.. దేశం అప్పు ఎంత ఉందో వెలుగులోకి వచ్చేది కాదేమో? ఉన్నతాధికారులు కూడా ఎవరూ చెప్పేవారు కాదేమో? కానీ, దేశ రుణభారం ఎంతో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ఓ ఆయుధమైంది. సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సహ చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం దేశ రుణ భారంపై సమాధానం ఇచ్చింది.
ఎన్డీఏ హయాంలోనే 73 లక్షల కోట్లు..?
అప్పులు చేయడంలో ఏ ప్రభుత్వమూ తక్కువ కాదు. అది రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా చాలా ప్రభుత్వాలు చేసేదే. అయితే, ఇందులో ఎవరు ? ఎంత? అప్పు చేశారనేదే ముఖ్యం. ఈ లెక్కన అన్నిలెక్కలు చూస్తే.. గత ఏడేళ్లలో ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 70లక్షల కోట్లు అప్పుచేసింది. యూపీఏ హయాం ముగిసే నాటికి.. అంటే 2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62లక్షల 42వేల 220.92కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.కోటి 35లక్షల 86వేల 975.52కోట్లకు చేరింది. మోదీ హయాంలో ఏడేళ్లలో 117 శాతం పెరిగింది. 64ఏళ్లలో దేశం రుణం రూ.62.42 లక్షల కోట్లు మేర ఉండగా, ఏడేళ్లలోనే కొత్తగా రూ.73లక్షల 44వేల 754కోట్ల అప్పు చేసినట్లు ఈ సమాచారం ద్వారా వెల్లడైంది.
2 వేల కోట్లతో మొదలై..
1950-51లో దేశ అంతర్గత రుణం రూ.2వేల 22.30కోట్లు, విదేశీ రుణం రూ.32.03 కోట్ల మేర ఉండగా, 2021-22
నాటికి అంతర్గత రుణం రూ.కోటి 13లక్షల 57వేల 415కోట్లు, విదేశీ రుణం రూ.4కోట్ల 27లక్షల 925.24కోట్లకు ఎగబాకింది. ఏడు దశాబ్దాల క్రితం చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఎరువు కంపెనీలు, ఎఫ్‌సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవు.
దమ్ముగా నిలదీసే ప్రతిపక్షాలు ఏవీ?
ఏడేళ్లలో 73 లక్షల కోట్ల అప్పు..అంటే ఏడాదికి 10 లక్షల కోట్లు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పులివి. మరి ఈ డబ్బును ఏం చేశారు? ఏ పనులకు ఉపయోగించారు? వాటిలో ఉత్పాదకం ఎంత? అనుత్పాదకం ఎంత? ఇంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇలా నిలదీసే ప్రతిపక్షాలు ఉంటే.. కేంద్రానికి సమాధానం వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇరుకున పడేది. కానీ, ఏ ప్రతిపక్షమూ ఈ మేరకు కేంద్రాన్ని ఎదుర్కొనే దమ్ము చేయడం లేదు.