షాకింగ్ గా మారిన కుర్రాడి గుడ్డు య‌వ్వారం

Update: 2018-02-23 05:09 GMT
విన్నంత‌నే కొట్టిపారేయొచ్చు. పొద్దు పొద్దున్నే మేం దొరికామా? ఏంది ఇలాంటివి చెప్ప‌టానికి అనుకోవ‌చ్చు. కానీ.. ఇది నిజం. కోడి పెట్టే గుడ్డు మాదిరే.. ఒక కుర్రాడు గుడ్లు పెడుతున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కాలం ఏదో గుడ్లు పెడుతుంటాడ‌ట‌.. వింత వ్యాధితో బాధ ప‌డుతున్నాన్న మాట‌కు భిన్నంగా.. ఆ కుర్రాడు అంద‌రి ముందే గుడ్డు పెట్టిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఇంత‌కీ ఈ చిత్ర‌మైన య‌వ్వారం ఎక్క‌డ చోటు చేసుకుంద‌న్న విష‌యంలోకి వెళితే.. ద‌క్షిణ ఇండోనేషియాకు చెందిన 14 ఏళ్ల అక్మ‌ల్ చిత్ర‌మైన కుర్రాడు. అత‌డు మామూలుగానే ఉంటాడు కానీ.. ఒక్కోసారి ఉన్న‌ట్లుండి గుడ్డు పెట్టేస్తుంటాడు. గ‌డిచిన‌రెండేళ్ల వ్య‌వ‌ధిలో అత‌డు 18 గుడ్లు పెట్టేశాడు. అయితే.. ఇదంతా క‌ట్టుక‌థ అని అనుకున్న వారంతా ఇప్పుడు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎందుకంటే.. గ‌త సోమ‌వారం త‌మ క‌ళ్ల ముందే అక్మ‌ల్ రెండు గుడ్లు పెట్టిన తీరు ప‌లువురిని షాక్ కు గురి చేసింది.

గ‌తంలో త‌మ కొడుకు గుడ్లు పెడుతున్న విష‌యాన్ని గుర్తించి ఆశ్చ‌ర్యానికి గుర‌య్యామ‌ని.. వాటిని ప‌గ‌ల‌కొట్టి చూస్తే.. అచ్చం కోడి గుడ్డు మాదిరే ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు. అక్మ‌ల్ గుడ్ల‌ను మింగేయ‌టం ద్వారా ఇలా చేస్తున్నాడా? అన్న సందేహాలు ప‌లువురిలో ఉన్నాయి. కానీ.. అలాంటిదేమీ లేద‌న్న విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. తాజాగా వైద్యుల ముందు కూడా గుడ్లు పెట్టేయ‌టం.. వాటిని ప‌రీక్షించిన వైద్యులు అవి కోడిగుడ్లుగా తేల్చారు. కోడిగుడ్లు ఒక కుర్రాడి క‌డుపు నుంచి ఎలా వ‌స్తున్నాయి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

అయితే.. ఈ కుర్రాడి విష‌యంలో వైద్యులు కొన్ని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.  మ‌ల‌ద్వారం గుండా అక్మ‌ల్ శ‌రీరంలోకి గుడ్లు పంపించి.. వాటిని త‌ర్వాత బ‌య‌ట‌కు తీసుకొస్తున్నాడా? అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. అలా పంపినా గుడ్లు పెట్ట‌టం అసాధ్య‌మ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అరుదైన వ్యాధితో అక్మ‌ల్ బాధ‌ప‌డుతున్నాడా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌నిషి పెడుతున్న గుడ్ల లెక్క తేల్చేందుకు అక్మ‌ల్ ను త‌మ అబ్జ‌ర్వేష‌న్లోకి తీసుకున్నారు వైద్యులు. వారం పాటు త‌మ ప‌రిశీల‌న‌లో ఉంచాల‌ని నిర్ణ‌యించారు. దీంతో.. నిజానిజాలు ఏమిటో తేలిపోతాయ‌ని.. అత‌డిపై ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌టం ద్వారా అస‌లు సంగ‌తి తేలిపోతుంద‌ని చెబుతున్నారు. అయితే.. మ‌నిషి గుడ్లు పెట్ట‌టం అక్మ‌ల్ తోనే షురూ కాలేదు. మూడేళ్ల క్రితం ఇండోనేషియాకులోని ఉత్త‌ర జ‌కార్తాకు చెందిన సినిన్ కూడా ఇదే త‌ర‌హాలో గుడ్లు పెట్టినట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

Tags:    

Similar News