హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. థియేటర్లో నీళ్ల కోసం వెళ్లిన ఒక బాలికను ధియేటర్లో పని చేసే సిబ్బంది ఒకరు అత్యాచారం చేసిన వైనం సంచలనంగా మారింది. బంధువుల సాయంతో బయటపడిన బాధితురాలు పోలీసులకు జరిగిన దారుణం గురించి వెల్లడించింది.
కలకలం రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన 14 ఏళ్ల బాలిక సిటీకి వచ్చి బోరబండలో నివాసం ఉంటున్న అన్నా వదినల వద్ద ఉంటోంది. గుడిసెల్లో నివసించే వీరు రోజువారీ నీళ్ల అవసరాల కోసం తమకు ఎదురుగా ఉన్న విజేత థియేటర్ నుంచి తెచ్చుకుంటుంటారు. ఎప్పటిలానే మంగళవారం ఉదయం బాలిక నీటి కోసం థియేటర్లోకి వెళ్లింది.
అక్కడ పని చేసే ప్రశాంత్ అనే యువకుడి కన్ను బాలిక మీద పడింది. నీళ్లు పట్టిస్తానంటూ చెప్పి బాలికను సెల్లార్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాత్రూంలో బంధించి బయట గడియపెట్టి ఏమీ తెలీనట్లు బయటకు వచ్చేశాడు.
నీళ్ల కోసం థియేటర్లోకి వెళ్లిన బాలిక ఎంతకూ రాకపోవటంతో.. బంధువులు థియేటర్లోకి వెళ్లగా.. జరిగిన దారుణం బయటకు వచ్చింది. బాధితులు పోలీసుల వద్దకు వెళ్లగా.. అక్కడ రాజీ కోసం రాయబేరాలు జరిగినట్లుగా చెబుతున్నారు. బాధితురాలు పేదింటి అమ్మాయి కావటంతో.. డబ్బుతో సెటిల్ చేసుకుందామన్న రాజీ యత్నాలు సాగాయి. అయితే.. ఈ విషయం బయటకు పొక్కి మీడియా రంగప్రవేశం చేయటంతో సీన్ మారింది.
ఇంత దారుణంపై రాజీ ప్రయత్నాలకు పోలీసులు సహకరిస్తారా? అన్న క్వశ్చన్ తో అధికారుల్లో చలనం వచ్చింది. రాజీలను పక్కన పెట్టి కేసు నమోదు చేసి.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంలో నిందితుడి తరపు రాజీ చేసేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేయటం.. అధికారులు ఆ దిశగా కేసు నమోదు చేయటంపై ఆలస్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి సమగ్ర విచారణ చేపట్టాలన్న వినతి పలువురి నుంచి వస్తోంది.