వాట్సప్ మెసేజ్‌లు ఎంతగా పాపులర్ అయిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ 1400 కోట్ల మెసేజ్ లు ఒక్కరోజే పంపించడం అంటే రికార్డుతో సమానం. కొత్త సంవత్సర వేళ వాట్సప్ మెసేజ్‌లు ఇలా సునామీ సృష్టించాయి. డిసెంబర్ 31న ఒక్కరోజే దేశవ్యాప్తంగా వాట్సప్ నుంచి 1400 కోట్ల మెసేజ్ లు వెళ్లాయంటే స్మార్ట్ ఫోన్ల హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క రోజే 310 కోట్ల ఇమేజెస్ - 70 కోట్ల జిఫ్స్ - 61 కోట్ల వీడియోలు షేర్ చేసుకున్నారు. వాట్సప్ చరిత్రలో ఇది అసాధారణమని ఆ సంస్థే ప్రకటించింది.
వాట్సప్ ప్రజల జీవితాల్లో ఓ ముఖ్య భాగమైపోయింది. పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలన్నా.. ఫ్రెండ్స్ - కుటుంబ సభ్యులు - బంధువులతో ఎప్పుడూ కనెక్టయి ఉండాలన్నా వాట్సప్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వాట్సప్ అందరికీ సౌకర్యవంతంగా, వేగంగా - నమ్మకంగా ఉంది అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల 2017లో ఊహించినదాని కంటే ఎక్కువ ఆదాయం వాట్సప్ సొంతం కానుంది. ఫేస్ బుక్ ఆధీనంలో ఉన్న ఈ సంస్థకు ఇప్పటివరకు భారత్ లోనే 16 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అంటే ఇది రష్యా కంటే ఎక్కువ జనాభా. దీంతో దేశంలో తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకొనే వీలు వాట్సప్ కు కలిగింది.
ఇదిలాఉండగా ఇండియాలో సాంప్రదాయ మెసేజ్ లకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. వాట్సప్ లపైనే జనం ఎక్కువగా ఆధారపడటంతో సాంప్రదాయ ఎస్సెమ్మెస్ లు వాడకం భారీగా తగ్గిపోయి టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రెవెన్యూ కోల్పోతున్నాయి. రీసెర్చ్ కంపెనీ ఓవమ్ ప్రకారం 2016 వరకే టెలికాం కంపెనీలు 310 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/