ప్రపంచ చెస్ ఛాంపియన్ కు షాకిచ్చిన మన పోరగాడు

Update: 2022-08-22 16:30 GMT
అవును.. నిజమే. అవతలోడు మామూలోడు కాదు. ఎకంగా ప్రపంచ చెస్ ఛాంపియన్. ఇవతల ఉన్నోడు సామాన్యుడు కాదు. కాకుంటే పోరగాడు. కరెక్టుగా చెబితే 17 ఏళ్లు. చెన్నైలో పుట్టిన ఈ టీన్ కుర్రాడు ప్రపంచ చెస్ లో సంచలనం. ఇలాటి డిఫరెంట్ కాంబినేషన్ లో మియామీలో జరిగిన వరస పోటీల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్ కార్లసన్ ను ఓడించటం ద్వారా చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద రమేశ్ బాబు సంచలనంగా మారారు.

మియామీలో జరుగుతున్న ఎఫ్ టీఎక్స్ క్రిప్టో కప్ లో బ్లిట్జ్ ప్లే ఆఫ్ రౌండ్ లో వరుసగా మూడుసార్లు కార్లసన్ ను ఓడించటం ద్వారా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. తనకు తిరుగులేదన్న విషయాన్ని చాటి చెప్పారు. వీరిద్దరి మధ్య మొత్తం ఆరు గేమ్ లు జరిగాయి. వాటిల్లో ప్రజ్ఞానంద మూడు గేమ్ లు గెలవగా.. కార్లసన్ ఒక గేమ్ లో గెలిచారు. మిగిలిన రెండు గేములు డ్రాగా ముగిశాయి.

తొలి రెండు గేమ్ లు డ్రాగా ముగియగా.. తర్వాత సంచలన విజయాల్ని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచుల అనంతరం టోర్నీలో అత్యధికంగా 16 పాయింట్లు సాధించిన కార్లసన్ ను విజేతగా ప్రకటించగా.. ప్రజ్ఞానందను 15 పాయింట్లలో రన్నరప్ గా నిలిచారు. ఈ టోర్నీలో ప్రజ్ఞానంద వరుసగా నాలుగు విజయాల్ని సొంతం చేసుకున్నాడు.

ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారుడు లెవాన్ అర్నోయాన్ ను 3-1 తేడాతో ఓడించాడు. అయితే..ఈ టోర్నీలో చైనా ఆటగాడు క్యూయాంగ్ లెయిమ్ లీ.. పోలాండ్ కు చెందిన జాన్ కె.డుడా చేతిలో ఓటమి పాలు కావటంతో అతని పాయింట్ల మీద ప్రభావాన్ని చూపింది. ఇక.. కార్లసన్ తో జరిగిన నాలుగు గేమ్ ల రౌండ్ లో తొలి రెండు డ్రా చేసుకున్న అతడు మూడో గేమ్ లో ఓడాడు.. నాలుగో గేమ్ లో పుంచుకొని విజయం సాధించాడు.

మ్యాచ్ ను ట్రై బ్రేక్ కు తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన రెండు గేముల్లో విజయం సాధించటం ద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్ కు షాకిచ్చాడు. విజేతగా నిలిచినప్పటికీ.. తనకంటే వయసులో దగ్గర దగ్గర సగం వయసున్న కుర్రాడి చేతిలో వరుస ఓటములు చెందటం ఆయన్ను కలిచివేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News