ఏపీలో తాజాగా 180 పాజిటివ్, న‌లుగురి మృతి

Update: 2020-06-03 09:10 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఆ వైర‌స్‌తో స‌హ‌జీవ‌నం చేస్తుండ‌గా దాని ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై తీవ్రంగానే ఉంది. దీంతో పెద్ద‌సంఖ్య‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 180 కేసులు నమోద‌య్యాయి.  విదేశాల నుంచి వచ్చిన వారు, లోకల్ కాంటాక్ట్, వలస కూలీలతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్ర‌మంలో రాష్ట్రవ్యాప్తంగా 8,066 న‌మూనాలు పరీక్షించగా మొత్తం 180 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధ‌వారం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. వీటిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94 మంది, విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి నిర్థారణ అయ్యిందని వెల్ల‌డించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసులు 3,279కు చేరాయి.

తాజాగా 35 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో ఆస్ప‌త్రుల నుంచి ఇళ్ల‌కు వెళ్లారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 967కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,244 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.  ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా ఆ వైర‌స్‌తో మొత్తం 68 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల నలుగురు చనిపోయారు.. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ ఇత‌ర జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింక్ ఉంద‌ని తెలుస్తోంది.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 700పైగా పాజిటివ్ కేసులు ఉండ‌గా, తర్వాతి స్థానం గుంటూరు జిల్లాదే. ఈ జిల్లాలో 450కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 573 ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు.
Tags:    

Similar News