ఒకటి , రెండు , మూడు కాదు ఏకంగా ఒకేసారి 18 వేల కిలోల బాంబుని సముద్రంలో పేల్చివేశారు. సముద్రం మధ్యలో జలచరాలు లేకుండా చూసి మరీ పేల్చారు. పర్యావరణానికి నష్టం కలుగకుండా తగిన చర్యలు చేపట్టారు. అమెరికా తూర్పు తీరంలో పరీక్ష చేశామని అమెరికా నౌకాదళం ప్రకటించింది. కానీ ఆ వీడియో మాత్రం ఒళ్లు గగుర్పాటుకు గురిచేసింది. యూఎస్ ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ (సీవీఎన్78) నౌక పై నుంచి అట్లాంటిక్ మహా సముద్రంలో తొలి పేలుడు పరీక్షను నిర్వహించింది.
40 వేల పౌండ్ల (సుమారు 18,143 కిలోలు) బరువున్న బాంబును సముద్రం అడుగు భాగాన పేల్చింది. ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్ లో భాగంగా కొత్త నౌకలు బాంబు పేలుళ్ల ధాటికి ఎలా తట్టుకుంటాయో తెలుసుకునేందుకు, వాటి యుద్ధ సన్నద్ధతను బేరీజు వేసుకునేందుకు ఈ పరీక్షను నిర్వహించింది. జలచరాలు, పర్యావరణానికి ఎలాంటి నష్టం లేకుండానే అమెరికా తూర్పు తీరంలో ఈ పరీక్ష చేసినట్టు అమెరికా నౌకాదళం ప్రకటించింది. అయితే, పేలుడు ధాటికి సముద్రం నీళ్లు అల్లంతెత్తుకు ఎగిసిపడ్డాయి. దాని తరంగాలు చాలా దూరం వరకు విస్తరించాయి. తీసిన వీడియో కూడా షేకయ్యింది. 10 నుంచి అంకెలు లెక్కబెట్టగానే పెద్దగా శబ్దం వచ్చింది. నీళ్లు పైకి ఎగిసి పడ్డాయి. ఆ శబ్దంతో భూకంపం వచ్చిందా అనే అనుమానం కలిగింది. కానీ తాము అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని అమెరికా నౌకాదళం వెల్లడించింది. ఈ పేలుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Full View