గ్రేటర్ హైదరాబాద్ కు జరుగుతున్న ఎన్నికల్లో మరో కీలక అంకం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ రోజుసాయంత్రం 3 గంటలతో ముగిసింది. గడువులోపు రెబెల్స్ ను బరి నుంచి తప్పించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కిందామీదా పడ్డాయి. అసంతృప్త నేతల్ని బుజ్జగించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించినప్పటికీ కొందరు మాత్రమే వెనక్కి తగ్గారు.
తాజాగా నామినేషన్ల ఉపసంహరణకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగిసే సమయానికి మొత్తం 150 డివిజన్లలో 1939 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగిన అసంతృప్త నేతల్లో గురువారం ఒక్కరోజులోనే 454 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తి అయిన నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్తుల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది. ఆ జాబితా విడుదలైతే ఏ పార్టీ నుంచి ఎంతమంది రెబెల్ అభ్యర్థులు బరిలో ఉన్నారన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అయితే మాత్రం 150 స్థానాలకు 1939 పందెం కోళ్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పకతప్పదు.