అమిత్ షా పేరుతో మూడు కోట్లు అడిగార‌ట‌!

Update: 2019-12-30 06:01 GMT
దేశంలో ఇప్పుడు అంత్యంత ప‌వ‌ర్ ఫుల్ ప‌ర్స‌న్స్ లో రెండో స్థానంలో ఉంటారు అమిత్ షా. కేంద్ర హోం మంత్రిగా, భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడిగా అమిత్ షా ఒక వెలుగు వెలుగుతున్నారు. సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు కూడా షాతో పెట్టుకోవ‌డానికి ఇప్పుడు ఇబ్బంది ప‌డుతూ ఉన్నారు. ఆరేళ్ల కింద‌టి వ‌ర‌కూ ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌గా ఉండిన సోనియాగాంధీకి కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు అమిత్ షా. అందులో ఆయ‌న గొప్ప‌ద‌నం ఏమీ లేక‌పోవ‌చ్చు. ఆయ‌న చేతిలో ఉన్న అధికారం గొప్ప‌ద‌న‌మే అదంతా కావొచ్చు. ఆ ప‌వ‌ర్ ను సాధించుకున్న వ్య‌క్తి అయితే అమిత్ షానే కాబ‌ట్టి.. ఆయ‌న ఇప్పుడు ప‌వ‌ర్ ఫుల్.

మ‌రి అలాంటి వ్య‌క్తి పేరు వాడుకుని కోట్ల రూపాయ‌లు దండుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు ఇద్ద‌రు హ‌ర్యానా వ్య‌క్తులు. అది కూడా వారు కోట్ల రూపాయ‌ల‌కు టెండ‌ర్ పెట్టారు.

ఇంట‌ర్నెట్ లో అదేదో యాప్ ఉంద‌ట‌.. దాన్ని ద్వారా ఫోన్ నంబ‌ర్స్ ను డూప్లికేట్ చేయొచ్చ‌ట‌. ఆ యాప్ ను నిషేధించారు. అయినా దాన్ని ఉప‌యోగించుకుని, అమిత్ షా  నంబ‌ర్ నుంచి కాల్ వెళ్లిన‌ట్టుగా క్రియేట్ చేశార‌ట వాళ్లు. ఆ కాల్ ను ఒక మంత్రికి చేశారు. ఆయ‌న‌తో మూడు కోట్ల రూపాయ‌లు అడిగార‌ట‌. స్వ‌యంగా అమిత్ షా అడ‌గ‌మ‌న్న‌ట్టుగా వారు పార్టీ ఫండ్ గా మూడు కోట్ల రూపాయ‌లు ఇవ్వాల‌ని వారు చెప్పార‌ట‌.

ఫోన్ నంబ‌ర్ డూప్లికేష‌న్ ద్వారా ఆ ఫోన్ అమిత్ షా నుంచినే వెళ్లిన‌ట్టుగా అనిపించే టెక్నిక్ ను వారు ఫాలో అయ్యారు. అయితే స‌ద‌రు మంత్రి.. క్రాస్ చెక్ చేసుకోడానికి అమిత్ షా ఓఎస్డీ ని సంప్ర‌దించార‌ట‌. దీంతో అస‌లు క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై ఢిల్లీ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చార‌ట అమిత్ షా ఓఎస్డీ. దీంతో హ‌ర్యానా వ్య‌క్తుల గుట్టు బ‌య‌ట‌ప‌డింది. వారిద్ద‌రినీ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తానికి దేశంలోనే అత్యంత ప‌వ‌ర్ ఫుల్ నంబ‌ర్ టు  పేరుతోనే ప‌రాచ‌కాలు చేసి ఇరుక్కున్న‌ట్టుగా ఉన్నారు వాళ్లు!

Tags:    

Similar News