ఇదేమీ జోక్‌గా చెబుతున్న విషయం కాదు. నిజంగా.. నిజంగా జరిగిన విషయం. బ్రిటన్‌లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎలుకకు అజన్మశత్రువైన పిల్లి అక్కడే ఉండి.. ఎలుక ఇష్టారాజ్యంగా గోల చేస్తున్నా.. పట్టించుకోకుండా మొద్దునిద్ర పోవటం. దీంతో.. ఎలుక పని పట్టేందుకు మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి.. దాని అంతు చూడటం మరింత విస్మయాన్ని కలిగిస్తుంది.
బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సమావేశం నిర్వహిస్తున్న హాలులో ఒక ఎలుక ప్రవేశించి గోల చేయటం భరించలేకపోయారు. ఎలుకల్ని పట్టుకొని వాటి అంతు చూడాల్సిన పిల్లి ల్యారీ.. బద్ధకంగా నిద్రపోవటం.. దాన్ని కదిపినా ఒక కన్ను మాత్రమే లేపి.. లైట్ తీసుక్కో బాస్ అన్నట్లు బద్ధకంగా నిద్రపోవటం ప్రధాని కామెరన్‌కు మండిపోయేలా చేసింది.్ణ
ప్రధాని చిరాకును గమనించిన మంత్రుల్లో ఇద్దరు లేచి.. ఎలుక వెంట పడ్డారు. అలా పడిన మంత్రుల్లో హాన్‌కాక్ క్రికెటర్ కూడా. దీంతో.. ఫిట్‌నెస్ ఉండటంతో ఎలుక వెంట పరుగులు దీసి.. దాన్ని పట్టుకొని విజయగర్వంతో బ్యాగ్‌లో బంధించేసి.. పర్యావరణ అధికారులకు అందించేంత వరకూ విడిచి పెట్టలేదు. ఇదంతా క్యాబినెట్ మీటింగ్ హాల్‌లోనే జరిగింది. మంత్రిగారి శ్రమ ప్రధానమంత్రి గుర్తిస్తూ.. ఆ పని చేయాల్సిన పిల్లి హాయిగా నిద్రపోవటంతో దాన్ని ఎలుకల్ని వేటాడే బాధ్యతల్ని తప్పించి పంపించేశారు. మొత్తానికి ప్రజాసమస్యలపై చర్చించుకోవాల్సిన మంత్రులు.. ఎలుకల్ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు బ్రిటన్‌లో హాట్ టాపిక్ అయ్యింది.