శేషాచల అడవుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి తాజాగా మరో సమాచారం అందింది. ఇందులో మరణించిన ఇరవై మంది తమిళనాడు ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.
మృతులంతా తమిళనాడుకు చెందిన వారని.. వారిలో నలుగురు వేలూరు.. ఎనిమిది మంది విల్లుపురం.. మరో ఎనిమిది మంది తిరువణ్ణామలైకి చెందిన వారిగా గుర్తించారు. వీరి మృతదేహాలకు పోస్ట్‌మార్టంను నిర్వహించనున్నారు. అనంతరం వీరి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు.
శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తమిళనాడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీకి వచ్చే బస్సులు ఆగిపోయాయి. అదే సమయంలో ఏపీకి నుంచి చెన్నైకి వెళ్లే బస్సులు నిలిచిపోయాయి.