టీడీపీ సీనియర్ నేత - మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. తాజాగా ఆయన బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఉదయం ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే..
కోడెల మరణంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నెపాన్ని నెట్టుకుంటున్నాయి. అయితే కోడెల మరణానికి ముందు చోటుచేసుకున్న ఒక పరిణామం చుట్టూ ఇప్పుడు ఆయన ఆత్మహత్య చిక్కుముడి నెలకొంది.
అయితే రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఆయన ఒక 20 నిమిషాల ఫోన్ కాల్ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కోడెల తన భార్యతో కలిసి టిఫిన్ చేశారు. 10.10 గంటలకు మొదటి అంతస్తులోని తన గదికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు 8.30 గంటల సమయంలో ఒకరితో ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. సుమారు 20 నిమిషాలకు పైగా ఫోన్ లో మాట్లాడినట్టు కాల్ రికార్డులో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి ఎవరు? కోడెల ఏం మాట్లాడారు? ఆ తర్వాతే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
పోలీసులు కోడెలకు వచ్చిన ఫోన్ కాల్స్ - ఎస్ ఎంఎస్ ల ఆధారంగానే ఇప్పుడు ఆయన ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పడినట్టు సమాచారం.
కాగా ఇక కోడెల మృతిపై అనుమానాల నేపథ్యంలో ఆయన పోస్టుమార్టాన్ని వీడియో తీశారు. బలమైన తాడు మెడకు చుట్టుకోవడం వల్లే ఊపిరి ఆడక చనిపోయినట్టు పోస్టుమార్టంలో వైద్యులు గుర్తించినట్టు తెలిసింది. ఇక కోడెల పోస్టుమార్టం ఆయన కుమారుడు శివరామకృష్ణ జనరల్ సర్జన్ గా పనిచేస్తున్న ఉస్మానియా ఆస్పత్రిలోనే చేయడం గమనార్హం.