ఏపీలో జగన్ సై అంటే.. ప్రతిపక్ష టీడీపీ సైసై అంటోంది. అక్కడ టగ్ ఆఫ్ ఫైట్ నడుస్తోంది. ప్రతిపక్షం బలంగా ఉండడం.. దాని చేతిలో ప్రధాన మీడియా, అస్త్రశస్త్రాలు ఉండడంతో జగన్ సర్కార్ నే ఇరుకునపెట్టేలా టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారం ఉంది. మరి తెలంగాణలో.. ప్చ్.. అబ్బే చప్పటి రాజకీయం.. ‘కేసీఆర్ ను కొట్టే మగాళ్లు ఇంకా పుట్టలేదు’ అని ఇన్నాళ్లు టీఆర్ఎస్ శ్రేణులు అనుకున్నారు. అత్యంత బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఇటీవల బీజేపీ కాస్త కంగారుపెట్టింది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో గెలిచి సై అన్నది. కానీ కేసీఆర్ రంగంలోకి దిగి ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఎన్నికలతో బీజేపీ బలం కొన్ని ప్రాంతాలకే.. కొంత మేరకే అని నిరూపించాడు.
అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీపై ప్రజల్లో సానుభూతి ఉంది. కానీ కేసీఆర్ గద్దెనెక్కగానే కాంగ్రెస్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయం చేశాడు. నేతలను లాగాడు.. పార్టీలోని సీనియర్ల నోళ్లు మూయించారు. కాంట్రాక్టులో.. లేక అవసరాలో కానీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు సైతం కేసీఆర్ పై గట్టిగా పోరాడడానికి ఏనాడు సిద్దమవ్వలేదన్న విమర్శ రాజకీయవర్గాల్లో ఉంది.
కానీ ఒక్కడొచ్చాడు.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి జైలుకెళ్లినా సరే కేసీఆర్ పై పోరాటం ఆపలేదు. గట్టిగా పోరాడాడు. ఆ పోరాట ఫలితమే.. ఇప్పుడు ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేలా చేసింది. ఏడేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలను గుడ్డిగా నమ్మి పార్టీని తెలంగాణలో మూడోస్థానానికి పరిమితం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి జ్ఞానోదయం అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లతో పనికాదని తెలిసిపోయింది. అందుకే అందరినీ పక్కనపెట్టి ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చినా సరే కేసీఆర్ ను ఢీకొట్టే రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ అధిష్టానం పట్టకట్టడం విశేషం.
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీలో బండి సంజయ్ లా దూకుడుగల నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. అతడి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. పైగా కాంగ్రెస్ శ్రేణుల్లో విపరీతమైన అభిమానం సొంతం.. ఇన్నాళ్లకు కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందని ఆపార్టీ వర్గాలే అంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో కాంగ్రెస్ కు మంచి ఊపు వచ్చింది.
ఇప్పటికే బీజేపీ సైతం ఈటల రాజేందర్ చేరికతో ఉత్సాహంగా ఉంది. పార్టీ బలోపేతంగా మారిందని సంబరపడుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రాకతో మరింతగా రాజకీయం వేడెక్కింది.
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రతిపక్షాలు బలంగా లేదు. అధికార టీఆర్ఎస్ ను గట్టిగా ఢీకొట్టేలా లేవు. పోటీనే లేదు అనుకుంటున్న తరుణంలో తెలంగాణలో త్రిముఖ పోటీ మొదలైంది. బీజేపీకి ఈటల బండి సంజయ్, కాంగ్రెస్ కు రేవంత్ ఖచ్చితంగా ప్లస్ అవుతారు. కానీ ఇక్కడ 2024 ఎన్నికల్లో ఎలా ఉంటుందనేది చెప్పలేం. రేవంత్ మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపగల నేతగా చెబుతున్నారు.
విశ్లేషకుల అంచనా ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీలు.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటింగ్ ని ఖచ్చితంగా చీల్చుతాయి. అలా జరిగితే ఆ రెండు పార్టీలకు నష్టం.. మళ్లీ టీఆర్ఎస్ తన సొంత ఓటు బ్యాంకుతో అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఊపుతో కాంగ్రెస్ బలంగా తయారై రెడ్డి సామాజికవర్గం ఏకమైతే.. ఓట్లు కురిస్తే ఆ పార్టీకి ఉన్న నేతలంతా కలిసి కట్టుగా సాగితే కాంగ్రెస్ కే మొగ్గు ఉంటుందంటున్నారు. ఇదే జరిగితే బీజేపీని జీరో చేసి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ అన్నట్టుగా జరుగుతుందని అంటున్నారు.
ఇక షర్మిల పార్టీకి ఏమన్నా ఊపు వస్తే కాంగ్రెస్ కే అది నష్టం. ఎందుకంటే రెడ్డిల ఓట్లు చీలి రెడ్డి నాయకులు విడిపోతే కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు చీలిపోతాయి. తద్వారా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఎన్నికల్లో సమీకరణాలు మారిపోతాయని అంటున్నారు. కానీ షర్మిల బలపడడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.. ఎందుకంటే షర్మిల పార్టీలో కనీసం సర్పంచ్ స్థాయి నేతలు కూడా చేరడం లేదు. చాలా తక్కువ ప్రభావమే షర్మిలది ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఓవరాల్ గా చూస్తే విశ్లేషకుల అంచనా ప్రకారం.. 2024లో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉండొచ్చని అంటున్నారు. బీజేపీ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ఉండకపోవచ్చని.. కాంగ్రెస్ కు ఉన్నంత క్షేత్రస్థాయి బలం బీజేకి లేదు అని అంటున్నారు.