షాకింగ్ : ఇండియన్ నేవీలో కరోనా !

Update: 2020-04-18 07:10 GMT
భారత్ ను  కరోనా మహమ్మారి భయపెడుతోంది. రోజురోజుకి కరోనా భారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో  కీలక రంగాలకు కూడా ఈ వైరస్ సోకుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా..భారత నావికాదళంలో కూడా కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యిందనే వార్త సంచలనంగా మారింది.

నేవీ ముంబైలో పనిచేస్తున్న 21 మంది నావికులకు తాజాగా కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. ఈ నెల 7న నేవీలో పనిచేస్తున్న ఓ నావికుడికి మొదట కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతనికి ఐసోలేషన్‌ లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. తాజాగా కరోనా సోకిన నావికులందరినీ నేవీ ఆసుపత్రిలో క్వారెంటైన్ చేశారు. అలాగే వారి కుటుంబాలను హోం క్వారెంటైన్ చేసినట్టు సమాచారం.  వీరు ఎవరెవరితో మాట్లాడారు ? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారనే దానిపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర రాజధాని ముంబైలో అత్యధికంగా కరోనా  కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలోని నావికాదళంలో కూడా కరోనా బయటపడటంతో  ఆందోళన మొదలైంది. తాజా కేసులతో ప్రస్తుతం ఐఎన్ఎస్ ఆంగ్రెను పూర్తిగా లాక్ డౌన్ చేశారు. దీనికి కొద్ది దూరంలోనే యుద్ధనౌకలు,సబ్ మెరైన్స్ ఉన్న నావెల్ డాక్ యార్డు ఉంది. మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యలు తీసుకుంటోంది. కాగా,  ప్రస్తుతం మహారాష్ట్రలో 3320 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇందులో 331 మంది డిశ్చార్జి కాగా.. 2788 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 201 మంది మృతి చెందారు. భారత్‌ కరోనా  బాధితుల సంఖ్య  14378 చేరింది.  వీరిలో 1992 మంది కరోనా పై విజయం సాధించగా .. 480 మంది ఇప్పటివరకు మృతి చెందారు.
Tags:    

Similar News