ఇవాల్టి నుంచి ఈ బాదుళ్లు ఉండ‌వ్ బాస్‌!

Update: 2019-01-01 05:35 GMT
కొత్త సంవ‌త్స‌రం వ‌స్తుందంటే అదో ఉత్సాహం ఊపేస్తుంటుంది. కాల‌చ‌క్రంలో ఒక ఏడాది క‌లిసి పోయి కొత్త సంవ‌త్స‌రం వ‌స్తున్న వేళ‌.. కోటి ఆశ‌లు.. అంత‌కు మించిన ఆకాంక్ష‌లు మ‌న‌సుల్ని ఊపేస్తుంటాయి. మ‌రోవైపు.. కొత్త సంవ‌త్స‌రం వేళ కొత్త త‌ర‌హాలో బాదేసే ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ఏం ఉంటాయ‌న్న గుబులు మ‌న‌సును తొలుస్తూ ఉంటుంది.

అయితే.. ఈ ఏడాది ఆరంభంలోనే అదిరే ఆఫ‌ర్ ను మోడీ స‌ర్కారు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ఏడాది కావ‌టంతో అన్ని వ‌ర్గాల మన‌సుల్ని దోచుకునేందుకు మోడీ మాష్టారు భారీగా ప్లానింగ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో శాంపిల్  ఈ రోజు నుంచి షురూ కానుంది. జీఎస్టీ పేరుతో బాదేస్తున్న మోడీ స‌ర్కారు.. 23 వ‌స్తు సేవ‌ల విష‌యంలో ప‌న్నులు త‌గ్గిస్తూ ఈ మ‌ధ్య‌నే నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

అలా త‌గ్గించిన ప‌న్నుపోటు ఈ రోజు నుంచి అమ‌ల్లోకి రానుంది. మొన్న‌టివ‌ర‌కూ ప‌న్ను క‌త్తితో పొడిచిన తీరుకు భిన్నంగా ప‌న్ను లేని వ‌స్తు సేవ‌లతో పాటు.. 28 శాతం ప‌న్ను శ్లాబుతో పోటేసిన స్థానే త‌గ్గిస్తూ తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుడి నుంచి సంప‌న్నుడి వ‌ర‌కూ అంద‌రికి ఆనందాన్ని క‌లిగించేదిగా చెప్పాలి.  మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంతో సినిమా టికెట్లు.. టీవీలు.. మానిట‌ర్లు.. ప‌వ‌ర్ బ్యాంకులు.. నిల్వ చేసిన కూర‌గాయ‌లు చౌక‌గా ల‌భించ‌నున్నాయి.

28 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గించిన డిజిట‌ల్ కెమేరాలు.. వీడియో కెమెరాలు.. రికార్డ‌ర్లు.. వీడియో గేమ్ ప‌రిక‌రాల‌తో పాటు.. ట్రాన్స్ మిష‌న్ షాఫ్ట్‌.. రీయూజ్ టైర్ల లాంటి వాటి ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. మొత్తంగా కొత్త సంవ‌త్స‌రం వేళ కొంగొత్త‌గా బాద‌కుండా.. అందుకు భిన్నంగా రిలీఫ్ ఇవ్వ‌టం అంద‌రిని ఆనందించేలా చేస్తుంద‌ని చెప్పాలి. ఎన్నిక‌ల ఏడాది కావ‌టంతో రానున్న రోజుల్లో ఇలాంటి నిర్ణ‌యాలు మ‌రిన్ని ఉండొచ్చంటున్నారు.

అయితే.. ఇదంతా తొలి అర్థ‌భాగంలోనేన‌ని.. ఎన్నిక‌లు ముగిసి.. ఫ‌లితాలు వెల్ల‌డై.. మోడీ మాష్టారే మ‌ళ్లీ ప్ర‌ధానిగా ఎన్నికైతే మాత్రం.. భారీ ఎత్తున సంస్క‌ర‌ణ‌లు తెర మీద‌కు వ‌స్తాయ‌ని.. అందులో భాగంగా బాదుడు కూడా అదే స్థాయిలో ఉంటుంద‌న్న అంచ‌నాల్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. రేప‌టి సంగ‌తి ఎలా ఉన్నా.. ఇవాల్టికైతే ఆల్ హ్యాపీస్ అనేలా ప‌న్నుపోటు త‌గ్గుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Full View

Tags:    

Similar News