బాబుకే కాదు.. బాబు మిత్రుల‌కు '23' షాక్!

Update: 2019-07-24 05:12 GMT
అనుకోకుండా జ‌రిగింద‌ని చెప్పాలా.. అలానే రాసి పెట్టింద‌నాలో కానీ.. ఇప్పుడో అంశం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యేలు మాత్ర‌మే గెల‌వ‌టం తెలిసిందే. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న ప్ర‌త్య‌ర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని చంద్ర‌బాబు లాగేయ‌టం.. తాజా ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పార్టీకి 23 మంది ఎమ్మెల్యేల్నే ఇచ్చిన వైనం ఆస‌క్తిక‌రంగానే కాదు.. ప‌లువురి నోట నానింది.

ఇక‌.. ఇదే అంశంపై జ‌గ‌న్ అయితే దేవుడున్నాడ‌న్న మాట‌ను ప‌లుమార్లు.. ప‌లు వేదిక‌ల మీద చెప్పారు. బాబుకే కాదు.. బాబు మిత్రుల‌కు సైతం 23 షాక్ త‌గిలిందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ స‌ర్కారు నిన్న కూలిపోవ‌టం తెలిసిందే. బ‌ల‌నిరూపణ ఎపిసోడ్ సీరియ‌ల్ మాదిరి సాగి.. నిన్న రాత్రి  (మంగ‌ళ‌వారం)  ఒక కొలిక్కి వ‌చ్చింది.

క‌ర్ణాట‌క‌లో కుమార‌స్వామి స‌ర్కారు కూలిపోయిన డేట్ 23 కావ‌టం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. బాబుకు అచ్చిరాని 23.. ఆయ‌న మిత్రుడైన కుమార‌స్వామికి కూడా అచ్చి రాలేద‌న్నది ఆస‌క్తిక‌ర అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో రానున్న నెల‌ల్లో 23 తేదీల్లో మోడీకి మింగుడుప‌డ‌ని రీతిలో ఉండే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు షాకులు త‌ప్ప‌వ‌న్న పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. ఇదంతా చూస్తే.. 23 అంకె రానున్న రోజుల్లో మ‌రిన్ని రాజ‌కీయ అల‌జడుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుందా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News