పది రోజులుగా సాగుతున్నపార్లమెంటు సమావేశాలు కాంగ్రెస్ ఆందోళన మధ్య కొనసాగకోవటం.. ఏ రోజుకు ఆ రోజు వాయిదా పడటంపై అధికారపక్షం సీరియస్ అయ్యింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి నేతృత్వంలో సాగిన అఖిలపక్షం సానుకూలంగా సాగలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రుల్ని పదవుల నుంచి తప్పించాలన్న ఏకైక డిమాండ్‌ను కాంగ్రెస్‌బలంగా వినిపించగా.. అందుకు అధికారపక్షం ససేమిరా అంది.
ఈ నేపథ్యంలో.. సభా కార్యక్రమాల్ని ఆటంకపరుస్తూ.. కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.సభ్యులు నినాదాలు ఆపాలని.. తమ తమ స్థానాల్లోకి వెళ్లి.. సభను కొనసాగించేందుకు సహకరించాలంటూ లోక్ సభ స్పీకర్ కోరినప్పటికీ ఫలితం లేదు. దీంతో.. ఆందోళన చేస్తున్న సభ్యుల పేర్లను చదివిన స్పీకర్.. సభా సంప్రదాయాలకు భంగం వాటిల్లేలా వ్యవహరించొద్దన్న సుమిత్రా మహాజన్.. సభ్యులు తన మాటను వినిపించుకోకుండా ఆందోళన చేస్తుండటంతో వారిపై ఐదు పనిదినాల పాటు సభ నుంచి సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం ప్రకటించి.. సభను మంగళవారానికి వాయిదా వేశారు.