దేశంలో కరోనావైరస్ వేగంగా విజృంభిస్తుంది. ఈ కరోనావైరస్ కి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో, వైరస్ ను వేగంగా విస్తరించకుండా ఉండేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లాక్ డౌన్ ను విధించాయి. ఈ లాక్ డౌన్ కొంతమేర కరోనా వ్యాప్తిని తగ్గించినప్పటికీ కూడా కొందరు తెలియక చేసే కొన్ని పనుల వల్ల చాలామంది కరోనా భారిన పడుతున్నారు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా.. అతను ఓ సామూహిక విందు ఏర్పాటు చేసినట్టు వివరాలు బయటకి రావడంతో ఆ విందులో పాల్గొన్నవారందరు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... దుబాయ్ లో వెయిటర్ గా పనిచేస్తున్న సురేశ్ అనే వ్యక్తి తల్లి గత నెలలో మరణించారు. ఆ కారణంతో గత నెల 17 న అతను స్వస్థలం మొరేనాకు దుబాయ్ నుండి తిరిగొచ్చాడు. ఇక మార్చి 20న తన తల్లికి దశదిన కర్మ నిర్వహించి బంధువులు, కాలనీవాసులకు భోజనాలు పెట్టించాడు. ఆ విందుకి దాదాపు 1200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. ఆ కార్యక్రమం అంతా ముగిసిపోయిన తరువాత మార్చి 25న సురేశ్ జ్వరం బారినపడ్డాడు. ముందు సాధారణ జ్వరం అనుకోని ఇంటి వద్దే ఉన్నా, ఆ తరువాత కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వెళ్లడంతో అతనికి, అతని భార్యకు కరోనా సోకినట్టు ఏప్రిల్ 2 న నిర్దారణ అయ్యింది.
దీనితో ఆ ఆ దంపతులతో సన్నిహితంగా ఉన్న 23 మందికి పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి పాజిటివ్ వచ్చింది. దీనితో వారిని కూడా ఐసోలేషన్ కి తరలించి కరోనా కి చికిత్స అందిస్తున్నారు. అయితే , విందు ఏర్పాటు చేసిన దంపతులకి , అలాగే ఆ విందుకి హాజరైన పదిమందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో , వారితో సన్నిహితంగా మెలిగిన 26 వేలమందిని క్వారంటైన్ చేసారు. తొలుత 1500 మందిని క్వారంటైన్ కు తరలించగా..తాజాగా ఈ సంఖ్య 26వేల మందికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.