రోనాల్డో బస చేసే హోటల్ గది అద్దె నెలకు 2.5 కోట్లు..!

Update: 2023-01-09 04:33 GMT
పోర్చుగీస్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నాస్ర్ ఫుట్ బాల్ క్లబ్ లో ఇటీవల చేరాడు. ఈ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ 2025 వరకు అల్ నాస్ర్ క్లబ్ తరఫున ఆడేందుకు సంతకం చేసినట్లు ఆ క్లబ్ నిర్వహాకులు అధికారికంగా ప్రకటించారు. కాగా కొద్దిరోజుల కిందట ముగిసిన 2022 ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగీస్ క్వార్టర్ ఫైనల్స్ లో మొరాకో చేతిలో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది.  

గతేడాది నవంబర్లో మాంచెస్టర్ యునైటెడ్‌తో తన ఒప్పందాన్ని రోనాల్డో రద్దు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో క్లబ్ ప్రధాన కోచ్ ఎరిక్ టెన్ హాగ్ మరియు మేనేజ్‌మెంట్ టీమ్‌ను విమర్శలు గుప్పించాడు. ఆ తర్వాత ఖతర్ వేదికగా జరిగిన ఫిపా వరల్డ్ కప్ లో రోనాల్డ్ కేవలం ఒకే గోల్ చేసి అందరినీ నిరాశ పరిచిన సంగతి అందరికీ తెలిసిందే.

క్రమంగా మాంచెస్టర్ యునైటెడ్‌కు దూరవుతూ వస్తూ సౌదీ అరేబియాకు చెందిన అల్ నాస్ర్ ఫుట్ బాల్ క్లబ్ లో చేరాడు. 2025 వరకు ఆ దేశం తరుపునే రోనాల్డ్ ఆడనున్నాడు. అతడి రాకను క్లబ్ నిర్వాహాకులు సైతం స్వాగతించారు.

ఈమేరకు పశ్చిమ ఆసియాలో రొనాల్డో ఏడాదికి 200 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా సంపాదించే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

రోనాల్డో ఏడాదికి 75 మిలియన్లతో సహా కొన్ని ప్రోత్సాహకాలు.. ప్రకటన రాబడి మరియు అమ్మకాలలో కొంత శాతం దక్కుతుందని పేర్కొన్నాయి. అల్ నాస్ర్ కు వెళ్లిన తర్వాత తన పరివారంతో కలిసి రియాద్ లోని కింగ్ డమ్ టవర్లోని హోటల్ సూట్లో బస చేయనున్నట్లు తెలుస్తోంది.

రోనాల్డ్ బస చేసే సూట్ లో ఏకంగా 17 గదులు ఉండనున్నాయి. వీటి అద్దె నెలకు ఏకంగా 250000 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రెండున్నర కోట్లు. రోనాల్డోకు దుబాయ్ లో శాశ్వత నివాస స్థలం కల్పించేందు వరకు ఆయన ఆ సూట్ లోనే ఉండనున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఈ స్టార్ ఆటగాడి కోసం అల్ నాస్ర్ భారీ మొత్తంలో వ్యయం చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News