అలా ఎలా మర్చిపోయావు బాస్​.. 3 కోట్ల విలువైన పెయింటింగ్​ను చెత్తబుట్టలో!

Update: 2020-12-14 02:30 GMT
ఆయనో పెద్ద వ్యాపారి. వందల కోట్లకు అధిపతి. పెయింటింగ్​ అంటే ప్రాణం. ప్రపంచంలోని ఎంతో విలువైన పెయింటింగ్స్​ను సేకరించడం ఆయనకు హాబీ. కానీ ఓ విలువైన పెయింటింగ్​ను సుమారు రూ. 2.80 కోట్ల విలువైన ఓ పెయింటింగ్​ను పొరపాటున డస్ట్​బిన్​లో పడేశారు. ఫ్లైట్​ ఎక్కాక ఆయనకు విషయం గుర్తొచ్చింది. ఆ తర్వాత ఎలాగోలా కష్టపడి పెయింటింగ్​ను తిరిగి సంపాదించుకున్నాడు.


జర్మనీకి చెందిన ఓ వ్యాపారవేత్త.. వ్యాపారం పనిమీద జర్మనీ నుంచి ఇజ్రాయిల్ కు
వెళ్లాలనుకున్నాడు. అయితే అతడు సామగ్రి సర్దుకొనే క్రమంలో తన వద్ద ఉన్న ఓ విలువైన పెయింట్​ను విమానాశ్రయంలోని చెత్తబుట్టలో వేశాడు. అనంతరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి విమానాశ్రయ సిబ్బంది అతడి సామగ్రిని తనిఖీ చేసి పంపించారు. అయితే అతడు ఫ్లయిట్​ ఎక్కాక విషయం గుర్తుకు వచ్చింది.

రూ. 2.80 కోట్లు విలువైన ($340,000) French surrealist Yves Tanguy పెయింటింగ్​ను చెత్తబుట్టలో వేసినట్టు ఇజ్రాయిల్ లో దిగిన అనంతరం గుర్తొచ్చింది.దీంతో వెంటనే తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు, స్నేహితులు బంధువులకు విషయం చెప్పాడు. వాళ్లు వెంటనే విమానాశ్రయ సిబ్బందిని సంప్రదించారు. చివరకు ఓ చెత్తబుట్టలో పెయింటింగ్ దర్శనమిచ్చింది. దీంతో ఆ పెయింటింగ్​ను బిజినెస్​ మ్యాన్​కు ఇచ్చేశారు.


Tags:    

Similar News