నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబుపై పార్టీ పరమైన విచారణకు ఏపీ సీఎం ఆదేశించారు. అయితే.. నేరుగా మంత్రిపై విచారణ అనకుండా జరిగిన ఘటనపై విచారణగా దీన్ని పేర్కొంటున్నారు. ఘటనఫై విచారణ అయినా... ఆరోపణలు ఎదుర్కొంటున్నది మంత్రి కావడంతో మంత్రిపై విచారణగానే భావించాలి.
రావెల నుంచి తనకు - తన భర్తకి ప్రాణహాని ఉందంటూ గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్ షేక్ జానీమూన్ నిన్న మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై మంత్రి రావెల కూడా స్పందిస్తూ.. జానీమూన్ తో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుంటామని మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. అయితే, జానీమూన్ - రావెల తమ మధ్య నెలకొన్న ఈ విభేదాల నేపథ్యంలో వారిరువురు మీడియా ముందుకు రావడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహించినట్లు తెలుస్తోంది.
మంత్రిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో.. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ ద్వారా విచారణ జరిపాలని, అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావుకి చంద్రబాబు సూచించారు. కమిటీలో రాష్ట్ర మంత్రి చినరాజప్ప - టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య చౌదరి - టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు ఉంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/