ఓ వైపు మానవుడు చంద్రమండలంపై ప్లాట్లు ఎలా వేయాలి? ఎంత రేటుకు అమ్మాలి? అని లెక్కలు వేస్తున్నాడు. మనుషులతో సెక్స్ లో పాల్గొనే రోబోలను డెవలప్ చేస్తున్నాడు.....నానాటికీ శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అటువంటి ఆధునిక యుగంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. మత విశ్వాసాలు మానవుల కళ్లు కప్పేస్తున్నాయి. సంప్రదాయాల పేరిట సమాజంలో కొన్ని దురాచారాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో జోగిని వ్వవస్థ తరహాలోనే నేపాల్ లో బాల దేవతల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయినా, ఆ సజీవ దేవతల కోసం వారి అన్వేషణ మాత్రం ఆగడం లేదు. తాజాగా, మరో కొత్త దేవతను ఎంచుకోవడంతో ఈ వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
తాజాగా నేపాల్ లో మరో సజీవ దేవతను గుర్తించారు. ఖాట్మండులోని అతిపురాతనమైన నెవార్ తెగకు చెందిన మూడేళ్ల చిన్నారిని సరికొత్త సజీవ దేవతగా త్రిష్ణ షక్యను అక్కడి ప్రజలు ఎన్నుకున్నారు. చిన్న వయసులోనే ఓ పాపను కుమారిగా ఎంచుకునే ప్రాచీన సంప్రదాయం ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి అమల్లో ఉంది. ఈ పాపకు ముందు కుమారిగా ఉన్న మతైనే షక్య యవ్వనంలోకి అడుగుపెట్టింది. దీంతో, కొత్త కుమారిగా షక్కను పూజారులు ఎంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సజీవ దేవత గా ఉండేందుకు నలుగురు పోటీపడగా - త్రిష్ణను నూతన కుమారిగా ఎంపిక చేశారు. గురువారం జరిగే ప్రధాన వేడుకలో అమె అధికారిక నియామకాన్ని ప్రకటిస్తారు.
ఈ వేడుకలో భాగంగా, షక్యను ప్రత్యేక పీఠంపై కూర్చోబెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఆ చిన్నారికి తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చిన్నారిని తన ఇంటి నుంచి పురాతన దర్బార్ స్కేర్ కు తీసుకెళ్తారు. కుమారిగా మారే కార్యక్రమం పూర్తయిన తర్వాత దర్బార్‌లో తనకు కేటాయించిన ప్రదేశంలోనే షక్య ఉండాలి. అప్పటి నుంచి షక్య సజీవ దేవతగా సేవలందుకుంటుంది. ప్రత్యేక సేవికలు అమెను 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. షక్యకు యుక్తవయస్సు వచ్చే వరకు దేవతగా పూజలందుకోనుంది. ప్రతి ఏడాది 13 సార్లు ప్రత్యేక పర్వదినాల సందర్భంగా మాత్రమే చిన్నారి దేవతను బయటకు తీసుకువచ్చి ప్రజలముందు ప్రదర్శిస్తారు. దేవతలా అలంకరించిన చిన్నారిని సేవికలు ఎత్తుకుని నగరమంతా ఊరేగిస్తారు. హిందూ - బౌద్ధ మత ఆచారాలు కలగలిసిన నేవార్ తెగలోని పిల్లల్నే చిన్నారి దేవతలుగా ఎంచుకుంటారు. అయితే, అభం శుభం తెలియని చిన్నపిల్లలను దేవతలుగా మార్చడం వల్ల వారు బాల్యానికి దూరమవుతున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రకంగా వారిని బంధించడం వల్ల వారి స్వేచ్ఛను హరిస్తున్నారని తల్లిదండ్రులపై బాలల హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. ఆధునిక యుగంలో కూడా ఇటువంటి మూఢనమ్మకాలను పాటించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.