హిందూ దేవాల‌యంగా చ‌ర్చి..అమెరికాలో సంచ‌ల‌నం

Update: 2018-12-24 10:34 GMT
అగ్రరాజ్యం అమెరికాలో మ‌నం గ‌ర్వించ‌ద‌గిన ప‌రిణామం ఇది. అమెరికాలోని ఓ చర్చిని హిందు దేవాలయంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వర్జీనియాలోని పోర్ట్స్‌ మౌత్‌ లో 30ఏళ్ల క్రితం నిర్మించిన చర్చిని స్వామినారాయణ్ హిందూ దేవాలయంగా మార్చనున్నారు. చర్చిని పూర్తిగా దేవాలయానికి అనుగుణంగా మార్చిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు.  సంస్థాన్ ఆధ్యాత్మిక గురువు పురుషోత్తం దాస్ స్వామి మార్గదర్శకత్వంలో 30ఏళ్ల క్రితం నిర్మితమైన చర్చిని కొనుగొలు చేసి స్వామినారాయణ్ టెంపుల్‌ గా పునరుద్ధరిస్తున్నామని సంస్థాన్ మహంత్ భగవత్ ప్రియదాస్ తెలిపారు.

అహ్మదాబాద్‌ లో ఉన్న స్వామి నారాయణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ కీల‌క ప్ర‌క్రియ చేప‌డుతున్నారు. స్వామి నారాయణ్ సంస్థాన్ అమెరికాలో మరో కొత్త ఆలయంగా మారనున్న చర్చిల్లో ఇది ఆరోది. మొత్తంగా ప్రపంచంలోనే తొమ్మిదోవది. 125 ఏళ్ల క్రితం నిర్మించిన కెనడాలోని టోరొంటో చారిత్రాత్మక చర్చ్‌‌ను కూడా కొనుగోలు చేసి స్వామి నారాయణ్ టెంపుల్‌ గా ఆధునికీక‌రించారు.  గతంలో అమెరికాలోని కాలిఫోర్నియా - ల్యూసెల్వీ - పెన్సుల్వేనియా - లాస్ ఏంజెల్స్ - ఓహియోలో గల చర్చిలను దేవాలయంగా మార్చారు. అలాగే లండన్‌ తో  పాటు మాంచెస్టర్ సమీపంలోని బోల్టన్‌ లో చర్చిలను హిందూ ఆలయాలుగా మార్చారు.
Tags:    

Similar News