హమ్మయ్య..ఉగ్రవాదుల చెరనుంచి 344 మంది విద్యార్థులు సేఫ్​..!

Update: 2020-12-19 16:00 GMT
నైజిరియాలో ఉగ్రవాదుల చేతికి చిక్కిన దాదాపు 344 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఎట్టకేలకు వాళ్లను మిలిటెంట్లను వదిలేశారు. 344 మంది విద్యార్థులను ఉగ్రవాదులు కిడ్నాప్​ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అయితే మిలిటెంట్లు ఆ విద్యార్థులను విడిచిపెట్టడంతో ఉగ్రమూక చెరనుంచి వారంతా వచ్చేశారు. కత్సినా రాష్ట్ర గవర్నర్ అమిన్ బెల్లో ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. వాళ్ళ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.

విద్యార్థులు ప్రస్తుతం భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నారని.. వాళ్లంతా త్వరలోనే తల్లిండ్రుల వద్దకు వెళతారని ఆయన చెప్పారు. వారం క్రితం వాయువ్య నైజీరియాలోని కాన్కరా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలపై ఉగ్రవాదులు దాడిచేసి విద్యార్థులను కిడ్నాప్​ చేశారు. అప్పుడు నైజిరియా ఆర్మీకి.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. అయినప్పటికీ ఉగ్రవాదులు విద్యార్థులను ఎత్తుకెళ్లారు.

దీంతో తల్లిదండ్రులతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యార్థులను ఉగ్రవాద చెర నుంచి బయటకు తెచ్చేందుకు వెంటనే రంగంలోకి దిగింది. ఉగ్రవాదులతో వరసగా చర్చలు జరిపింది. వాళ్ల డిమాండ్లకు అంగీకరించింది. దీంతో ఉగ్రమూక విద్యార్థులను వదిలేసింది. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఎప్పుడు ఇంటికి వస్తారా అని కంటి మీద కునుకు లేకుండా ఈ వారంపాటు బిక్కుబిక్కుమంటూ బతికారు. ఎట్టకేలకు వారి ప్రార్థనలు ఫలించాయి. తాజాగా ఉగ్రవాదులు విద్యార్థులను వదిలిపెట్టడంతో వాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News