జ‌ల్లిక‌ట్టు ఎద్దుకు స్కాన్‌..డాక్ట‌ర్ల‌కు రిపోర్ట్ షాక్‌!

Update: 2018-09-23 05:21 GMT
ఎద్దుల్లో జ‌ల్లిక‌ట్టు ఎద్దులు కాస్త భిన్నం. అదెలానంటారా? స‌ంక్రాంతి వేళ పందెం కోళ్ల‌కు.. మామూలు కోళ్ల‌కు ఉన్నంత తేడాగా చెప్పాలి. పందెంకోళ్ల‌ను ఎంత ప్ర‌త్యేకంగా పెంచుతుంటారో.. జ‌ల్లిక‌ట్టు కోసం సిద్ధం చేసే ఎద్దుల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అలాంటి ఒక ఎద్దు వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నం గా మారింది.

త‌మిళ‌నాడులోని మ‌ధురై జిల్లాకు చెందిన అళ‌గుమ‌ణి అనే రైతు జ‌ల్లిక‌ట్టు కోసం ఒక ఎద్దును జాగ్ర‌త్త‌గా పెంచుకుంటున్నాడు. ఈ ఎద్దు వారం క్రితం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది. వెంట‌నే.. వైద్యుల వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. స్కానింగ్ రిపోర్ట్ చూసిన వైద్యులు కంగుతిన్నారు. ఎందుకంటే.. ఆ ఎద్దుక‌డుపులో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ పేరుకు పోయిన వైనాన్ని గుర్తించారు.

గ‌డ్డి వేసే క్ర‌మంలో స‌ద‌రు ఎద్దు.. ప్లాస్టిక్ ను తినేసింది. అది కాస్తా భారీగా క‌డుపులో పేరుకుపోయింది. దీంతో.. ఆ ఎద్దు అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీంతో.. ఆ ఎద్దుకు ఆప‌రేష‌న్ చేసిన వైద్యులు.. మూడు గంట‌ల పాటు శ్ర‌మించి.. స‌ద‌రు ఎద్దు క‌డుపులో ఉన్న 38 కేజీల ప్లాస్టిక్ సంచులు.. వ్య‌ర్థాల్ని తొల‌గించారు.

జ‌ల్లిక‌ట్టు కోసం ప్ర‌త్యేకంగా పెంచుకున్న ఎద్దుల విష‌యంలోనే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. మామూలు ఎద్దుల సంగ‌తి ఏమిటి? అంటూ ప‌లువురు క్వ‌శ్చ‌న్స్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్లాస్టిక్ కార‌ణంగా మ‌నుషుల కంటే ప‌శువుల‌కే ముప్పు ఎక్కువ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నిషి నిర్ల‌క్ష్యం ప‌శువుల‌కేం తెలుసు?
Tags:    

Similar News