ట్రక్కులో 39 మృతదేహాలు.. ఎక్కడివి?

Update: 2019-10-24 04:42 GMT
ఓ భారీ ట్రక్కు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లింది. ఆ ట్రక్కు వెనుక భాగంగా మైనస్ 25 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉన్న భారీ ఫ్రీజర్ ఉంది. లండన్ మహానగరానికి దగ్గర్లో వచ్చిన ఆ ట్రక్కును పోలీసులు ఆపారు. తనిఖీల్లో భాగంగా ట్రక్కు వెనుక భాగం తెరిసి చూసి కరెంట్ షాక్ తగిలినట్లుగా వణికిపోయారు. ఎందుకంటే.. అందులో ఏకంగా 39 డెడ్ బాడీస్ ఉన్నాయి.

గ్రేస్ ఏరియా ఆఫ్ ఎసెక్స్ దగ్గర్లో ఉన్న వాటర్ గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో డెడ్ బాడీస్ ఉన్న ట్రక్కును గుర్తించారు. ట్రక్కులో భారీగా డెడ్ బాడీస్ వెళుతున్నట్లుగా తమకొచ్చిన సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో ఈ షాకింగ్ నిజం బయటకొచ్చింది. ఈ ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.

ఇంతకీ ఈ డెడ్ బాడీస్ ఎందుకు వచ్చాయి? లక్ష్యం ఏమిటి?అన్న ప్రశ్నలపై ప్రాథమిక ఆధారాలతో పోలీసుల అభిప్రాయం ఏమంటే..  బల్గేరియా నుంచి బ్రిటన్ లోకి అక్రమంగా వచ్చేందుకు ఈ ట్రక్కులో ప్రయాణించి ఉంటారని.. ప్రతికూల వాతావరణంలో వారు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ లో ప్రయాణించి దేశం దాటాలనుకున్నవారు మరణించి ఉండొచ్చనుకుంటున్నారు.

దాదాపు 19 ఏళ్ల క్రితం 2000లో కూడా ఇదే రీతిలో హోలీహెడ్ రేవు ద్వారా అక్రమంగా బ్రిటన్ లోకి వస్తూ చనిపోయారు. అప్పట్లో 58 మంది చైనీయులు మృత్యువాత పడ్డారు. ఇప్పటిమాదిరే ట్రక్కు వెనుక భాగంలో దాక్కొని బ్రిటన్ లోకి వద్దామన్న ప్రయత్నంలో వారు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఉదంతం కూడా అలాంటిదేనని అనుమానిస్తున్నారు.
Tags:    

Similar News