ఇక ఏపీలో కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది. తాజాగా నిన్న 351 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 275మంది కాగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 76మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. బుధవారం ఇద్దరు కరోనాతో చనిపోయారు. తాజాగా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కి చేరింది. 2906మంది కోలుకోగా.. 2559మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 90కి పెరిగింది.
తాజాగా గురువారం మరిన్ని కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం 351 పాజిటివ్ కేసులు నమోదైతే.. గురువారం ఏకంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 425 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఏపీలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఏపీలో తాజాగా నమోదైన 425 కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 5854కు చేరింది. ఇందులో 2779 యాక్టివ్ కేసులు కాగా.. 2983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 92కి చేరింది.
ఇవాళ ఏపీలో నమోదైన కేసుల్లో స్థానికంగా నమోదైనవి 229 కేసులు కాగా.. మిగిలిన 126 కేసులు వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారివి కావడం గమనార్హం.