కొత్త ‘ఆట’; నెలాఖరు నుంచి ఐదో ఆట

Update: 2016-08-10 06:04 GMT
సినిమా ప్రియులకు తీపివార్త ఇది. సినిమాలు ప్రదర్శించే థియేటర్ల షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న సినిమాల్ని ప్రోత్సహించేందుకు వీలుగా.. ఇప్పటివరకూ రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించే స్థానే.. ఈ నెలాఖరు నుంచి థియేటర్లు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు వీలుగా అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో.. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న నాలుగు ఆటల స్థానే.. ఈ నెల చివర నుంచి ఐదు ఆటలు అందుబాటులోకి రానున్నాయి.

నిత్యం చిన్నసినిమాను తప్పనిసరిగా ప్రదర్శించేందుకు వీలుగా.. రోజుకు ఇప్పుడున్న నాలుగు ఆటల స్థానే.. ఐదు ఆటల్ని ప్రదర్శించేలా అనుమతులు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తాజా విధానంతో.. ఇకపై థియేటర్లలో ఐదు ఆటలు ప్రదర్శిస్తారు. అంతేకాదు.. తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు.. వాణిజ్య ప్రాంతాలు.. బస్ డిపోలలో 200 సీట్ల సామర్థ్యం ఉన్న  మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో చిన్న సినిమాలకు ప్రోత్సాహకరంగా ఉండటంతో పాటు.. ఎక్కువ షోలతో సినిమా ప్రేమికుల్ని థియేటర్లు మరింత అలరించనున్నాయన్న మాట.  
Tags:    

Similar News