ఐదు వారాలుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నిరసనల్ని.. ఆందోళల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్ సర్కారు.. తాజాగా చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం సక్సెస్ కాకుండా చూడాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. ఊహించని రీతిలో ఏ పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న వారిని ఆ పోలీస్ స్టేషన్ పరిధి లోని వారిని అదుపు లోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బస్టాండ్లు.. రైల్వే స్టేషన్ల లో అదనపు భద్రతా దళాల్ని మొహరించటం ద్వారా అనుమానం వచ్చిన వారిని వచ్చినట్లుగా అదుపు లోకి తీసుకుంటున్నారు. విపక్ష నేతలు.. కార్యకర్తల తో పాటు.. మద్దుతుగా ఉన్న ప్రజా సంఘాల వారిని ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ స్టేషన్ లో ఇప్పటి వరకూ పాతిక మందిని అదుపు లోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి లో ఇప్పటి వరకూ 170 మందిని అదుపు లోకి తీసుకున్నట్లు గా సీపీ అంజన్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్దామ రెడ్డి న గోల్కొండ పోలీసులు అదుపు లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక.. మరో కీలక నేత రాజి రెడ్డి సైతం మహా రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం లో గుర్తు తెలియని వారు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఆచూకీ బయటకు రాలేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్టీసీ సంఘాల వారి వాదన ప్రకారం తెల్లవారే సరికే దాదాపు ఐదు వేల మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. చలో ట్యాంక్ బండ్ పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి.. హైదరాబాద్ మహానరానికి చెందిన పలువురిని శనివారం తెల్లవారు జాముకే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చలో ట్యాంక్ బండ్ ను నిలువరించటం లో కేసీఆర్ సర్కారు సక్సెస్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వ తీరును ఉద్యమ నేతలు.. ఆర్టీసీ జేఏసీ.. విపక్షాలు మాత్రం తీవ్రస్థాయి లో మండిపడుతున్నాయి.