పీఎస్ లో 5వేల రెమిడెసివిర్ వయల్స్.. విడుదల ఎప్పుడు?

Update: 2021-04-25 02:30 GMT
కరోనా వైరస్ సోకితే దానికి సరైన చికిత్స లేదు. మందులు లేవు. అందుకే ఇప్పుడు దాని నివారణకు వస్తున్న టీకాను అందరూ వేసుకుంటున్నారు. అయితే మందులు, చికిత్స లేని ఈ రోగానికి యాంటీ వైరల్ డ్రగ్స్ తో కంట్రోల్ చేసే అవకాశం ఉంది.

కరోనా రోగుల చికిత్సలో వాడే రెమిడెసివిర్ మందులకు ఇప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో రెమిడెసివిర్ ఇంజక్షన్ ను రూ.10వేల నుంచి రూ.50వేల వరకు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు.

ఇంత డిమాండ్ ఉన్న రెమిడెసివిర్ మందులు వృథాగా పోలీస్ స్టేషన్లలో పడి మూలుగుతున్న పరిస్థితులున్నాయి. సుమారు 5వేల ఇంజక్షన్ సీసాలు ఫుడ్ అండ్ డ్రగ్ సంస్థతోపాటు పోలీస్ స్టేషన్ లోనూ వృథాగా ఉన్నాయని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. వీటిని మార్చి-ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు.

అయితే కోర్టు అనుమతిస్తే తప్ప వీటిని కోవిడ్ రోగులకు వాడడానికి వీలు లేదని ఎఫ్డీఏ అధికారులు చెబుతున్నారు. వీటిని స్వాధీనం చేసుకున్నామని.. కానీ సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంటుందని.. అభియోగాలు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న వయల్స్ ను కోర్టులో అప్పజెప్పితే అప్పుడు కానీ అవి రిలీజ్ కావు.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి.. కేసుల జంజాటంలో నలిగిపోయిన ఈ రెమిడెసివిర వయల్స్ ను కోర్టు ఎంత త్వరగా అనుమతిస్తే అంత మంచిదని పలువురు సూచిస్తున్నారు.ఈ స్వాధీనం చేసుకున్న వయల్స్ ని సకాలంలో వాడేలా చేయాలని ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు.
Tags:    

Similar News