పాక్ టు ఇండియా: గీత తల్లి ఎట్టకేలకు దొరికింది

Update: 2021-03-11 12:15 GMT
చెవిటి, మూగ యువతి గీత.. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ కు వెళ్లింది. అక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఆశ్రయం పొందింది. అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో భారత్ కు చేరుకుంది.

అయితే ఆమె తల్లిదండ్రులు ఎవ్వరన్నది అసలు ప్రశ్న. ఈమెకు మాటలు రాకపోవడంతో గుర్తించడం కష్టమైంది. అడ్రస్ తెలుసుకోవడం దుర్లభమైంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల కోసం ఆమె చేసిన ఐదేళ్ల అన్వేషణకు ముగింపు దొరికినట్లు అయ్యింది.  

పాకిస్తాన్ లో తప్పిపోయి భారత్ కు తిరిగివచ్చిన బదిర యువతి గీతకు తన తల్లి ఆచూకీ నాలుగేళ్ల తర్వాత దొరకడం విశేషం. గీత కన్నతల్లి మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించారు. గీత తల్లి మహారాష్ట్రలోని నైగావ్ గ్రామంలో ఉన్నట్టు గుర్తించింది.  

నాటి విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో గీత 2015లో భారత్ కు చేరుకుంది. గీత అసలు పేరు రాధా వాఘ్మారే అని తెలిసింది.

కాగా గీత తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. తల్లి మీనా రెండో వివాహం చేసుకుంది. గీత చిన్న వయసులో తమకు కరాచీలోని రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కనిపించిందని ఈదీ ఫౌండేషన్ తెలిపింది.
Tags:    

Similar News