వార‌ణాసిలో మ‌న రైతులు!..చుక్క‌లు క‌నిపిస్తున్నాయే!

Update: 2019-04-28 08:05 GMT
తాము పండిస్తున్న ప‌సుపుకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర దొర‌కాలంటే ప‌సుపు బోర్డును ఏర్పాటు చేయాల్సిందేన‌నేది నిజిమాబాద్ జిల్లా రైతుల డిమాండ్. ఈ డిమాండ్ ఇప్ప‌టిది కాదు. ఎప్ప‌టినుంచో ఉన్న‌దే. ఈ డిమాండ్ కు టీఆర్ఎస్ నేత‌, స్థానిక ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌ద్ద‌తు ప‌లికినా... ప‌ని కాలేదు. దీంతో వినూత్న నిర‌స‌న‌కు తెర తీసిన ప‌సుపు రైతులు క‌విత‌పై పోటీగా పెద్ద సంఖ్య‌లో నిజామాబాద్ బ‌రిలో నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఫ‌లితంగా ఈ బ‌రి అంద‌రి దృష్టినీ ఆక‌ట్టుకుంది. రాష్ట్ర స్థాయిలో త‌మ వినూత్న నిర‌స‌న‌కు ల‌భించిన ప్ర‌చారం... దేశ‌వ్యాప్తంగా వినిపించేందుకు రైతులు నిర్ణ‌యించుకున్నారు. ఇంకేముంది వార‌ణాసి బ‌య‌లుదేరారు. అక్క‌డా నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు య‌త్నించారు. అయితే అదేమంత ఈజీ కాద‌ని వారికి ఇట్టే అర్థ‌మైపోయింది. ఎంతైనా అక్క‌డ పోటీచేస్తున్న‌ది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌దా. మ‌రి ప‌రిస్థితి కాస్తంత భిన్నంగా ఉండ‌టం మామూలే. అయితే ఇప్పుడు అక్క‌డ నామినేష‌న్లు వేసేందుకు వెళ్లిన మ‌న రైతుల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌.

మోదీపై పోటీకి దిగి త‌మ స‌మ‌స్య‌ను జాతీయ స్థాయిలో నానేలా చేసేందుకు 50 మంది ప‌సుపు రైతులు శుక్ర‌వారం రాత్రికే వార‌ణాసి చేరుకున్నారు. ఈ విష‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టిన యూపీ పోలీస్‌.... మ‌నోళ్లు అక్క‌డ కాలు మోప‌డ‌మే ఆల‌స్యం వేధింపులు షురూ చేశారు. వార‌ణాసిలో మ‌నోళ్లు అడుగుపెట్ట‌డంతోనే ప్ర‌త్య‌క్ష‌మైపోయిన పోలీసులు... వివ‌రాలు ఆరా తీశార‌ట‌. విష‌యం తెలుసుకున్న త‌ర్వాత అడ్రెస్ ల‌తో పాటు ఫోన్ నెంబ‌ర్ల‌ను సేక‌రించేశారు. అంతేనా... మోదీపైనే నామినేష‌న్లు వేసేందుకు వ‌స్తారా? అంటూ బెదిరింపుల‌కు కూడా దిగార‌ట‌. స‌రే... ఎలాగోలా అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డి రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యం చేరుకుంటే... అక్క‌డ ఏకంగా నామినేష‌న్ ప‌త్రాలు కూడా ల‌భించ‌లేద‌ట‌. అక్క‌డ ఎంట్రీ ఇచ్చిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు వ్యూహాత్మ‌కంగానే అల్ల‌ర్లు సృష్టించి మ‌న రైతుల‌కు నామినేష‌న్ ప‌త్రాలు ద‌క్క‌కుండా చేశార‌ట‌. అయితే ఎలాగోలా అక్క‌డి ఓ స్థానిక లాయ‌ర్ ను ప‌ట్టుకుని నామినేష‌న్ ప‌త్రాలు చేజిక్కించుకున్నా... వాటిని దాఖ‌లు చేసేందుకు మ‌నోళ్లకు అస‌లు సిస‌లు స‌మ‌స్య ఎదురైంది.

అదేంటంటే... నామినేష‌న్ల ప్ర‌క్రియ‌లో అభ్య‌ర్థిని ప్ర‌తిపాదించేవారు కావాలి క‌దా. ఒక్కో అభ్య‌ర్థికి క‌నీసం ప‌ది మందైనా ప్ర‌పోజ‌ర్స్  కావాల్సిందే క‌దా. మ‌రి అక్క‌డెక్క‌డో మ‌నోళ్ల‌ను ప్ర‌పోజ్ చేసేవాళ్లు ఎందుకుంటారు? అందునా ప్ర‌ధాని మోదీ హ‌వా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై పోటీకి దిగుతున్నామ‌ని చెబితే... ప్రపోజ్ చేయ‌డానికి ఎవ‌రు వ‌స్తారు?  నిజ‌మే ఇలాంటి ఇబ్బందే మ‌నోళ్ల‌కు ఎదురైంది. నామినేష‌న్ వేసే అభ్య‌ర్థి ఉన్నా... ఆ అభ్య‌ర్థిని ప్ర‌తిపాదించేవారు లేక‌పోయారు. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు రిట‌ర్నింగ్ అధికారిగా ఉన్న క‌లెక్ట‌ర్ ను ఆశ్ర‌యించిన మ‌న రైతులు... తాము ఏ పార్టీకి గానీ, ఏ అభ్య‌ర్థికి గానీ వ్య‌తిరేకం కాద‌ని - కేవ‌లం త‌మ స‌మ‌స్య‌ల‌ను వినిపించేందుకే ఈ వినూత్న చ‌ర్య‌కు దిగుతున్నామ‌ని వివ‌రించార‌ట‌. అయినా కూడా ప్ర‌పోజ‌ర్స్ లేనిదే తానేం చేస్తానంటూ క‌లెక్ట‌ర్ చేతులెత్తేశార‌ట‌. అంటే... వార‌ణాసిలో మ‌నోళ్ల నామినేష‌న్లు వేసే విష‌షం డౌటేన‌న్న మాట‌.

   

Tags:    

Similar News