మహారాష్ట్ర ఉమ్రెడ్ కర్హాండ్లా అభయారణ్యంలో కనిపించకుండా మాయమైపోయిన పులి ‘జయ్’ ను పట్టిచ్చిన వారికి రూ. 50 వేలు రివార్డును ప్రకటించాయి. హైవేపై అటూఇటూ తిరుగాడే ఈ పులి రోడ్డుపై వెళ్లే జనంపై ఎప్పుడూ దాడి చేయలేదు. దీంతో స్థానికులందరికీ దగ్గరైంది. అలాంటి పులి వందరోజులుగా కనిపించకుండా పోవడంతో నాగ్ పూర్ నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. అది ఎక్కడున్నా బాగుండాలని పూజలు నిర్వహించారు. వంద మందికిపైగా వలంటీర్లు తప్పిపోయిన జయ్ కోసం గాలిస్తున్నారు. అయితే ఫలితం లేకపోవడంతో ఈ రివార్డు ప్రకటించారు.
సూపర్ హిట్ చిత్రం షోలే లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర పేరు జయ్. రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ పులికి ఆ పేరు పెట్టారు. తమకు అత్యంత చేరువైన పులి తప్పిపోవడంతో దాదాపు పది స్వచ్ఛంద సంస్థలు - పులి జయ్ అభిమానులు దీని జాడ కోసం అడవి అంతా జల్లెడ పడుతున్నారు. రూ. అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలు కూడా ముందుకు వచ్చి దీని జాడ కనుగొనడంలో సహకరిస్తాన్న ఉద్దేశంతోనే రూ. 50 వేలు రివార్డు ప్రకటించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జయ్ జాడ కనుక్కునే ప్రయత్నంలో దాదాపు 150 మంది ఐదు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో అధికారులు కంప్యూటర్ ద్వారా ఈ పులి కదలికలను గమనించేవారని ఈ అభయారణ్యం గౌరవ వార్డన్ అన్నారు. అయితే ఏప్రిల్ 18 నుంచి ఈ పులి కనిపించడం లేదనీ, ఆ విషయం తెలిసిన వెంటనే వారు ఫీల్డ్ మీదకు వచ్చి గాలింపు చేపట్టి ఉండాల్సింది కానీ అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. మొత్తం అభయారణ్యానికి ఈ పులే ప్రధాన ఆకర్షణ అని చెప్పిన స్థానిక గైడ్ ఒకరు కేవలం జయ్ ను చూసేందుకే పర్యాటకులు వచ్చేవారన్నారు. జయ్ తిరిగి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.