ప్రశాంత దేశం న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో ఉన్న మసీదుల్లో జాత్యాంహకారంతో కాల్పులకు తెగబడి 51మంది ముస్లింలను చంపేసిన దుండగుడు బ్రెంటన్ టారెంట్ కు కనీసం 510 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ చట్టాల ప్రకారం .. ఒక హత్యకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ లెక్కన 51మందిని చంపిన బ్రెంటాన్ టారెంట్ కు 510 ఏళ్లు పడడం ఖాయమంటున్నారు. 1961కి ముందు న్యూజిలాండ్ లో హత్యకేసుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించేవారు. కానీ 1961లో ఉరిశిక్షను రద్దు చేశారు. హత్య వెనుక ఉద్దేశం, హత్య తీరును బట్టి కనీసం 10 ఏళ్ల పాటు ఒక హత్యకు శిక్ష విధించేలా చట్టాలు మార్చారు.
2001లో విలియం బెల్ అనే వ్యక్తి ముగ్గురు వ్యక్తులను దారుణంగా హతమార్చారు. అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇప్పటివరకు న్యూజిలాండ్ లో ఇదే అత్యధిక కాలానికి విధించిన జైలు శిక్ష.
ఇప్పుడు క్రైస్ట్ చర్చ్ మసీదుల్లో 51మందిని చంపిన బ్రెంటాన్ పై అభియోగాలు మోపారు. ఒక్కో హత్య కేసులో పదేళ్ల చొప్పున.. కనీసం 510 ఏళ్ల జైలు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఇది తీవ్రమైన నేరం కావడంతో అతడి అప్పీల్ కు అవకాశం ఇవ్వరని.. జైలులో ఉన్నప్పుడు పెరోల్ సదుపాయాన్ని కూడా రద్దు చేస్తారని న్యూజిలాండ్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలపై శిక్షలను ఖరారు చేసే అవకాశాలున్నాయి.