ఏపీ ప్రభుత్వం తాజాగా 9713 శాంపిల్స్ ని టెస్ట్ చెయ్యగా... 52 మందికి పోసిటివ్ అని తేలింది. దీనితో, మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2282కి చేరింది. అయితే, వీటిలో 1527 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 50గా ఉంది. కాబట్టి, ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 705గా ఉంది. అయితే, రోజూ కొత్తగా వస్తున్న కేసులు తలనొప్పి తెప్పిస్తున్నాయి. తగ్గుతుందిలే అనుకునేలోపు మళ్లీ నెంబర్ పెరిగిపోతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 12, నెల్లూరులో 7, తమిళనాడు కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవారు 19 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.
ఇకపోతే , దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకి పెరిగి పోతుంది. దీన్ని అరికట్టడానికి ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242 కేసులు నమోదు కాగా, 157 మంది మరణించారు. అయితే గత రెండు రోజులుగా రోజు దాదాపు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో సోమవారం నాటికి దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 96,169కి చేరింది.
వీరిలో 3029 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 36, 824మంది కోలుకోగా 56,316 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఒకే రోజు ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి భారిన పడినవారి సంఖ్య 48,01,875కి చేరింది. ఇప్పటివరకూ 3,16,671 మంది మత్యువాత పడ్డారు