ఇండియాలో పన్నులు తక్కువ - రాయితీలు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఇండియాలోని 52911 కంపెనీలు మంచి లాభాల్లో ఉన్నా కూడా ఒక్క పైసా కూడా పన్నులు చెల్లించడం లేదట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. రాయితీల లెక్కన చూస్తే ఇవి చెల్లించే పన్నుల కంటే వీటికి వచ్చే రాయితీలే ఎక్కువట. దీంతో వీటి ఎఫెక్టివ్ ట్యాక్సు రేట్ 0 అంతకంటే తక్కువే ఉంటుంది.
2014-15లో ఇండియాలోని కంపెనీల్లో 43.6 శాతం కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. 3 శాతం కంపెనీలకు లాభమూ లేదు నష్టమూ లేదట. 47.4 శాతం కంపెనీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి. అయితే వీటి లాభం కోటి లోపే. 6 శాతం కంపెనీలే రూ.కోటి కంటే ఎక్కువ లాభాలు గడించాయి.
2014-15లో 52911 కంపెనీల ఎఫెక్టివ్ ట్యాక్సు రేట్ 0 అంతకంటే తక్కువే ఉందని ఆర్థిక శాఖ గణాంకాలే చెబుతున్నాయి. చక్కెర - సిమెంటు - మైనింగ్ - పవర్ - కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు - రాయితీలే దీనికి కారణం. 2010-11లో కొన్ని రంగాల్లో 22 శాతంగా ఉన్న ఎఫెక్టివ్ ట్యాక్సు రేట్ ఇప్పుడు 1.53 శాతానికి కూడా తగ్గించారు. పన్ను రేట్లు తగ్గడం వల్ల కొన్ని రంగాల్లో ఉత్పత్తి విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా చక్కెరను తీసుకుంటే వరుసగా ఆరో ఏడాది కూడా అవసరానికి మించి అధికంగా ఉత్పత్తి కానుంది. సిమెంటు విషయంలోనూ అంతే. ఇదంతా ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్లు తగ్గింపు ఫలితమే.