ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. భారీసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 57 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ఆరోగ్య బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో 24 గంటల్లో 9,739 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా 57 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కరు ఆ వైరస్ బారిన పడి మృతిచెందారు. తాజాగా 69 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం 2,339 పాజిటివ్ కేసుల్లో 1,596 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 52 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 691గా ఉంది.
ప్రస్తుతం నాలుగో దశ లాక్‌డౌన్ ప్రారంభమైనా ఆంక్షలన్ని సడలింపులు ఇవ్వడంతో వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకునేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్, వైరస్ కట్టడి చర్యలు తీసుకోవాలని సూచించారు.