కరోనా లేటెస్ట్ అప్‌డేట్స్: ఏపీలో మరో 67 మందికి పాజిటివ్ !

Update: 2020-05-04 07:50 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. రోజుకు కనీసం 60-70 కేసులకు తగ్గకుండా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు.. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 67 కొత్త కేసులు నమోదయ్యాయి.తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 19 - కృష్ణాలో 12 - విశాఖపట్నం 6 - కడప 4 - చిత్తూరు 1 కేసు నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.

దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరింది. అటు.. 524 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు. ప్రస్తుతం 1093 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే కరోనా కట్టడి కోసం విధించిన రెండోదశ లాక్ డౌన్  గడువు ..మే 3 తో ముగియడంతో ..మరోసారి రెండువారాలపాటు అంటే మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  అయితే , జిల్లాల్లో ఉండే కరోనా పాజిటివ్ కేసులని బట్టి ,,,మూడు జోన్లుగా విభజించి లాక్ డౌన్ ను కొన్ని సడలింపులు ఇచ్చారు. ఆంక్షలతో కూడిన కార్యకలాపాలకు గ్రీన్, ఆరెంజ్ జోన్ ‌లలో అనుమతి ఇచ్చారు.రెడ్ జోన్ జిల్లాలో లాక్ డౌన్ ను అలాగే కొనసాగించనున్నారు.
Tags:    

Similar News