ఎక్క‌డా త‌గ్గ‌ని క‌రోనా: ఏపీలో కొత్త‌గా 67 కేసులు

Update: 2020-05-05 07:15 GMT
క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. కరోనా ఉధృతి తగ్గడం లేదు. తాజాగా మంగ‌ళ‌వారం కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,717కు చేరుకున్నాయ‌ని వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఒకరు క‌రోనాతో మృతి చెందారని వెల్ల‌డించింది. ఇప్పటివ‌రకు మృతుల సంఖ్య 34కి చేరిఇంది. ఇప్పటివరకు 589 మంది డిశ్చార్జయ్యారు. ప్ర‌స్తుతం 1,094 మంది క‌రోనాతో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజాగా కేసుల్లో కర్నూలు 25, గుంటూరు 13, కృష్ణా 8, అనంతపురము, కడప, విశాఖలో రెండు చొప్పున కేసులు నమోదు కాగా, నెల్లూరులో ఒక కేసు నమోదైంది. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా 25 కేసులు న‌మోద‌వ‌డంతో ఇప్పటివ‌రకు ఆ జిల్లాలో మొత్తం కేసులు 516కు చేరుకున్నాయి.

రాష్ట్రంలో జిల్లాలో కేసుల సంఖ్య ఇలా ఉన్నాయి. గుంటూరు 351, కృష్ణా 286, నెల్లూరు 92, కడప 89, చిత్తూరు 82, అనంతపురం 80, ప్రకాశం 61, పశ్చిమగోదావరి 59, తూర్పు గోదావరి 45, విశాఖపట్నం 37, శ్రీకాకుళంలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News