ఆర్మీ క్యాంప్‌ లపై ఐసీస్ దాడి..71 మంది సైనికులు మృతి !

Update: 2019-12-13 11:33 GMT
సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని  ఉగ్రవాదులు భీకర దాడులు జరపడంతో.. 71 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే  మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన నైజీరియాలోని నైజర్ ప్రాంతంలో జరిగింది. తిల్లబెరి ప్రాంతంలో మంగళవారం రాత్రి  వందల సంఖ్యలో ఉగ్రవాదులు - ఆర్మీ బేస్ క్యాంపులపై దాడికి దిగారు. అలర్ట్ అయిన సైన్యం కూడా ఉగ్రవాదులను ప్రతిఘటించింది. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

అయితే మోర్టార్లు - రాకెట్ లాంచర్లతో వందలమంది ఉగ్రవాదులు దాడులకు దిగడంతో.. 71 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరి ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. తీవ్ర గాయాలపాలైన సైనికులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులు - సైన్యానికి మధ్య దాదాపు మూడు గంటల పాటు - భీకర కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసీస్ ప్రకటించుకుంది.  ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో రెడ్ అలర్ట ప్రకటించారు. 

ఈశాన్య సరిహద్దుల్లోని బోకోహారమ్ తీవ్రవాదులు.. పశ్చిమ సరిహద్దుల్లో ఐసిస్ ఉగ్రవాదులతో నైజీరియా సైన్యం నిరంతరం పోరాటం చేస్తోంది. ఉగ్రదాడితో నైజీరియా అధ్యక్షుడు ఇస్సోఫవ్ మహ్మద్ ఈజిప్టు పర్యటనను రద్దుచేసుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. ఈజిప్టు వేదికగా జరుగుతున్న శాంతి - భద్రత అంశాలపై జరుగుతున్న సమావేశంలో పాల్గొనడానికి ఆయన అక్కడకు వెళ్లారు. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడకు భారీగా చేరుకున్న సైన్యం ముష్కరుల కోసం అడగడుగునా జల్లెడపట్టింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు సైన్యం ప్రకటించింది.
Tags:    

Similar News