చేతికి పది పచ్చి మిరపకాయలు ఇచ్చి తొడాలు విర్చమంటేనే చేతులు మంట పుడుతున్నాయంటూ రాగాలు తీసే రోజులవి. ఎండుమిర్చిని ఎండలో ఎండబెట్టి.. ఆ తర్వాత కారం మరకు తీసుకెళ్లి కారం కొట్టించే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. కారంపొడిని పాకెట్లలో కొనేసి.. జాగ్రత్తగా డబ్బాలో పోసేయటం.. కారం చేతికి అంటకుండా స్పూన్ తో వాడేయటం ఇప్పుడో అలవాటుగా మారింది. కారం చేతికి తగిలినంతనే మంట.. మంట అంటూ హాహాకారాలు చేసే పరిస్థితి.
అలాంటిది 75 కేజీల ఎండుమిరపకాయలు తీసుకొచ్చి.. వాటిని దంచి..అన్నేసి కేజీల పచ్చి కారాన్ని నీళ్లల్లో కలిపేసి.. అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది. ఎండుమిర్చిని చేత్తో పట్టుకోవటానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో 75 కేజీల కారంతో అభిషేకం అంటే మాటలు కాదు. అయితే.. ఇందుకు భిన్నంగా ఒక అర్చక స్వామి తాజాగా 75 కేజీల కారంపొడితో అభిషేకం చేయించుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడులోని ధర్మపురి జిల్లా నల్లమ్ పల్లిలో కరుప్ప స్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఈ పూజలో ప్రత్యేకత ఏమంటే.. ఆలయ ఆర్చకుడు ఉపదేశం తర్వాత.. 75 కేజీల కారాన్ని అర్చకస్వామికి అభిషేకం చేస్తారు. ఈ ఆలయంలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తుంటారు. ఆనవాయితీ సంగతి తర్వాత.. అన్నేసి కేజీల గొడ్డుకారంతో అభిషేకం.. ఊహించుకుంటేనే మంట పుట్టేలా ఉంది కదూ? అలాంటిది ఆర్చక స్వామి ఎలా భరించారో ఏంటో?