ప్ర‌తి 20మందిలో ఒక‌రికి ఆ ప్రాబ్లం ఉంద‌ట‌

Update: 2017-02-26 08:13 GMT
భార‌తదేశం గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన స‌ర్వే రిపోర్ట్ వెలువ‌డింది. మన దేశంలో దాదాపు 9.5 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ తేల్చి చెప్పింది. ప్రపంచదేశాలపై జరిపిన అధ్యయన నివేదిక విడుదల చేసింది. భారత్‌లో 7.5 శాతం మంది మానసిక జబ్బులతో బాధపడుతున్నట్టు ఇందులో స్పష్టం చేసింది. చిన్నచిన్న ఇబ్బందులతో బాధపడుతున్నవారితోపాటు, తక్షణం వైద్యసేవలు అందించాల్సిన వారు సైతం ఉన్నారని చెప్పింది.

2016 అక్టోబర్‌ లో బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ ఐఎంహెచ్‌ ఏఎన్‌ ఎస్) దేశవ్యాప్తంగా ప్రజల మానసిక ఆరోగ్యంపై సర్వే చేసి నివేదిక విడుదల చేసింది. దేశంలో 5 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తేల్చింది. అంటే ప్రతి 20 మందిలో ఒకరు మానసికంగా ఆరోగ్యంగా లేనట్టు తేల్చింది. ఈ లెక్కన కేవలం ఏడాదిలోనే బాధితుల సంఖ్య దాదాపు మూడున్నరకోట్లు పెరిగిందన్నమాట. వెంటనే మానసిక వైద్యులు, నిపుణులు ఈ విషయంపై దృష్టిసారించాలని, కారణాలు కనుగొని చికిత్స ప్రారంభించాలని డబ్ల్యుహెచ్‌వో సూచించింది. ఎప్పుడూ బాధపడుతుండడం, నిరాశానిస్పృహలతో ఉండడం, ఆసక్తిలేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం, నిద్రలేమి, సంతోషంగా లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, అపరాధ భావనతో ఉండటం వంటివి ఒత్తిడి (డిప్రెషన్)కి సూచనలని చెప్పింది. ఆందోళన - భయం - ఫోబియా - పానిక్ డిజార్డర్ - జనరలైజ్‌ డ్ ఆైంగ్జెటీ డిజార్డర్ (జీఏడీ) - సోషల్ ఆైంగ్జెటీ డిజార్డర్ (ఇతరులతో కలువడానికి భయపడటం), అబ్‌ సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) - పోస్ట్ టర్మరిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి తీవ్ర మానసిక సమస్యలుగా పేర్కొన్నది. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News