భరతమాత దాస్య శృంఖలాలను తెగటార్చి.. ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి.. 75 ఏళ్లు. నిజానికి ఒక దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు అంటే.. అంత చిన్న విషయం కాదు. మనకంటే.. తర్వాత స్వాతంత్రం పొందిన అనేక దేశాలు.. అభివృద్ధిలో పరు గులు పెడుతున్నాయి. అదేసమయంలో అక్కడి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగిస్తూ.. ప్రజాస్వామ్య దేశాల్లో ఠీవీ గా నిలబడుతున్నాయి. మరి మన దేశం పరిస్థితి ఏంటి? విశాల భారతావనిగా.. 135 కోట్ల మంది.. భారతీయులు ఉన్న దేశంగా .. అలరారుతున్న ఈ దేశంలో ప్రజా గళానికి విలువ ఉందా? ప్రజలు-ప్రభుత్వం మధ్య అనుసంధానం ఎలా ఉంది? వంటి విషయాలు చర్చిస్తే.. ఇటీవల కాలంలో ఎదురవుతున్న పరిణామాలను బట్టి.. లేదనే అంటున్నారు పరిశీలకులు.
ప్రజల గళానికి విలువకట్టే నాయకుడు, వారి మాటలను వినిపించుకునే పాలకుడు దేశంలో కనుమరుగవుతున్నారు. ఫలితంగా దేశానికి 75 ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ అభివృద్ధి ఎందాక? ఎప్పటి వరకు? అనే మాట మా త్రం సమాధానం లేని ప్రశ్నగానే గోచరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ కూడా.. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరి వ్యూహాలు వారివే.. ముఖ్యంగా ఎన్నికల రాజకీయం ఖరీదు కావడం.. ఈ దేశానికి శాపంగా పరిణమించిందనే వాదన ఉంది. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు పాలకులు ఓట్లను కొనుగోలు చేస్తున్న తీరు.. భారతావని అభివృద్ధికి అడ్డుగోడగా మారు తోందని.. అనేక మంది మేధావులు విశ్లేషిస్తున్నారు. ఓట్లను కొనుగోలు చేసిన తర్వాత.. ప్రజల గోడు వినేందుకు ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.
ఈ తరహా పరిస్థితి గడిచిన దశాబ్దంనరగా మాత్రమే కనిపిస్తోంది. ఎన్నికలు ఏవైనా.. డబ్బులు పంచడం.. కానుకలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా నాయకుల తీరును ప్రశ్నించలేని పరిస్థితి ప్రజలకు దాపురించింది. ఈ విషయంలో వారు ఇస్తున్నారు కాబట్టి మేం తీసుకుంటున్నాం.. అని ప్రజలు.. ప్రజలు తీసుకుంటున్నారు కాబట్టి మేం ఇస్తున్నాం.. అని నేతలు.. చెబుతున్నంత వరకు ఈ దేశం బాగుపడే పరిస్థితి లేకుండా పోతుందని.. అంటున్నారు మేధావులు. అవినీతి ప్రక్షళనకు కంకణం కట్టుకున్నామని చెప్పే పార్టీలు కూడా.. ఎన్నికల తర్వాత.. షరామామూలుగా మారిపోతున్నాయి. ప్రజలకు ఏది అవసరమో.. అనే పరిస్థితి నుంచి..తమ అవసరాలకు ప్రజలను ఎలా వినియోగించుకోవాలనే వరకు ప్రజాస్వామ్యం దిగజారి పోయింది.
మేం చెప్పిందే.. మీరు వినాలి.. అనే మాట పాలకుల నుంచి వినిపిస్తోంది. దేశంలో దాదాపు ఏడాది కాలంగా.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా.. ఉద్యమం సాగుతున్నా.. పట్టించుకునే పాలకులు కరువయ్యారు. దాదాపు 5 మాసాలుగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని ఉద్యమిస్తున్నా.. పట్టించుకుని పరిష్కరించకపోగా.. అమ్మేస్తామనే చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా.. లేదు.. తెలంగాణకు ఇస్తామన్న పథకాలు ఇవ్వరు. ఇతర రాష్ట్రాల సమస్యలు కూడా అలానే ఉన్నాయి. ప్రజల మాటకు విలువ లేవు.. ప్రజల ఆకాంక్షలను పట్టించుకునే పరిస్థితే లేదు. ఇదీ.. ఇప్పుడు ఈ దేశం ఎదుర్కొంటున్న పరిస్థితి. నిరంతరం పెరుగుతున్న పెట్రోలు ధరలతో.. ప్రజల నడ్డి విరిగుతున్నా.. మౌనమే సమాదానంగా.. పాలకులు దూసుకుపోతున్నారు. ఇదీ.. 75 వసంతాల వేళ.. ప్రజలకు ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో పాలకులు ఇస్తున్న గౌరవం!!