కరోనా విలయం : ఒకే చితిపై 8 మృతదేహాలు !

Update: 2021-04-08 05:30 GMT
ప్రపంచంలో మరోసారి కరోనా కలకలం సృష్టుస్తుంది. కరోనా విలయంతో గతంలో కనిపించిన హృదయ విదారక దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. వైరస్‌ బారినపడి మరణించిన వారి అంత్యక్రియలకు శ్మశానంలో స్థలం లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలను కాల్చివేశారు. ఈ ఘటన దేశంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్న మహారాష్ట్ర లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. కరోనావైరస్‌ బారినపడి మరణించిన వారి అంత్యక్రియలకు స్మశానంలో స్థలం లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో మంగళవారం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే .. బీడ్ జిల్లాలో కరోనా మరణించిన వారిని ముందుగా అంబాజ్‌గాయ్‌ పట్టణంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అవి కరోనా బారిన పడి మరణించిన వారి శవాలు కావటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని మరో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ స్థలం సరిపడ లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో 50శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.  

ఇదిలా ఉంటే .. బ్రెజిల్‌ లో తొలిసారి ఒక్క రోజులోనే 4 వేలకు పైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. 24 గంటల్లో 4,195 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనితో  ఇప్పటివరకు మృతుల సంఖ్య 3.40 లక్షలుగా నమోదైంది. అమెరికా, పెరూ తర్వాత ఒకే రోజు 4 వేలకు పైగా మరణాలు నమోదైన మూడో దేశంగా బ్రెజిల్‌ నిలిచింది.  కరోనా సోకిన వారిలో అత్యధికులు ఆస్పత్రి పాలవుతూ ఉండడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరా లాక్‌డౌన్‌కి వ్యతిరేకం కావడం వల్లే ఈ స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అధ్యక్షుడికి మద్దతుగా ఉన్న గవర్నర్లు, మేయర్లు, రాజకీయ నాయకులు, ఇతర వర్గాలు  భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోక పోవడంతో కేసులు పెరిగిపోతున్నాయని బ్రెజిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ పాలసీ స్టడీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మిగెల్‌ లాగో అంచనా వేశారు.
Tags:    

Similar News