రోడ్డు నిబంధనలు కఠినంగా ఉంటాయని చెప్పే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం షాకింగ్ గా మారింది. గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ తాజా రోడ్డు ప్రమాదంలో మొత్తం 17 మంది మృతి చెందటం గమనార్హం. మరణించిన వారిలో 8 మంది భారతీయులేనని దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయ్ కు తిరిగి వస్తున్న బస్సు ఒక మెట్రో స్టేషన్ వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ట్రాఫిక్ సిగ్నల్ ను అతి వేగంగా దాటుకుంటూ వచ్చిన బస్సు.. సైన్ బోర్డును బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడినట్లుగా దుబాయ్ పోలీసులు చెబుతున్నారు.
మృతుల్లో ఎనిమిది మంది భారతీయులు ఉన్న విషయాన్ని దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం ఖరారు చేయటంతో పాటు.. భారత్ లోని మృతుల కుటుంబ సభ్యులకు.. బంధువర్గాలకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిలో భారతీయులు కూడా ఉన్నారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరణించిన భారతీయుల వివరాలు చూస్తే..
+ రాజగోపాలన్
+ ఫిరోజ్ ఖాన్ పఠాన్
+ రేష్మ ఫిరోజ్ ఖాన్ పఠాన్
+ దీపక్ కుమార్
+ జమాలుద్దీన్ అరక్కవీటిల్
+ కిరణ్ జానీ
+ వాసుదేవ్
+ తిలక్‌రామ్ జవహార్ ఠాకూర్