చిన్నమ్మ ఫ్యూచర్ ను తేల్చిన ఆ 8 నిమిషాలు

Update: 2017-02-14 08:38 GMT
ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు. నిన్నమొన్నటి వరకూ మకుటం లేని మహరాణిలా వెలిగిపోవటమే కాదు.. ఆమె వస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం వంగి దండం పెట్టే పరిస్థితి. చేతిలో ఎలాంటి పదవి లేకున్నా.. సీఎం సైతం రోజూ ఆమె ఇంటికి వచ్చిఅటెండెన్స్ వేసుకోవాల్సిన పరిస్థితి. అంతటి వైభోగాన్ని అనుభవించిన చిన్నమ్మ అలియాస్ శశికళ భవిష్యత్ మొత్తం మారిపోయింది.

జైళ్లు కొత్త కాదు.. పన్నీర్ లాంటోళ్లను వెయ్యి మందిని చూశాను.. వారేం పెద్ద విషయం కాదన్నట్లుగా ఘీంకరించిన శశికళ ఫ్యూచర్ కేవలం ఎనిమిదంటే.. ఎనిమిది నిమిషాల్లో తేలిపోయిందని చెప్పాలి. దేశ రాజధాని సుప్రీంకోర్టులోని కోర్టు నెంబరు 6లో.. అక్రమాస్తుల కేసును ద్విసభ్య ధర్మాసనం తమ తీర్పును వెలువరించింది. ఈ ఉదయం 10.30 గంటలకు అక్రమాస్తుల కేసుపై తీర్పు వెల్లడిస్తారన్న వార్త నేపథ్యంలో యావత్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది.

షెడ్యూల్ ప్రకారం.. పదిన్నర గంటలకు కోర్టు హాలుకు వచ్చిన న్యాయమూర్తులు.. అంతకు ముందే సిద్ధం చేసుకున్న తీర్పు పాఠాన్ని చదవటం మొదలుపెట్టారు. ఇరువురు న్యాయమూర్తులు తమ తీర్పుల్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేశారు. నాలుగేళ్ల జైలుతో పాటు జరిమానాను విధించటం ద్వారా.. పదేళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవటమే కాదు.. తమిళనాడు స్టేట్ కు సీఎం కావాలన్న కల చిన్నమ్మకు కలగానే మిగిలిపోయిన పరిస్థితి. ఎనిమిది నిమిషాలు చిన్నమ్మ భవిష్యత్ మొత్తాన్ని మార్చేశాయని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News